వీటిని పచ్చిగా తినడం ఆరోగ్యానికి హానికరం

09 April 2026

TV9 Telugu

TV9 Telugu

రకరకాల రంగుల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మిమ్మల్ని చాలా వరకు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ప్రతి కూరగాయలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

అయితే పచ్చి కూరగాయలను తరచుగా సలాడ్‌లు, శాండ్‌విచ్‌లలో కలుపుతారు. ఇలా పచ్చిగా తినడం వల్ల ఇవి మరింత ప్రయోజనకరంగా ఉంటాయని అందరూ భావిస్తుటారు

TV9 Telugu

వాస్తవానికి, వండే ప్రక్రియలో కొన్ని పోషకాలు నశించిపోతాయి. అయితే కొన్ని కూరగాయలను అస్సలు పచ్చిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం

TV9 Telugu

నూడుల్స్ నుంచి మోమోలు, సలాడ్ల వరకు అన్నింటిలోనూ క్యాబేజీని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఆకు కూర కావడం వల్ల, దీనిపై తరచుగా పురుగుమందులు జల్లుతారు. దీనిలో ఈ. కోలి, సాల్మొనెల్లా కూడా ఉంటాయి. అందువల్ల పచ్చి క్యాబేజీని తినడం అంత మంచిది కాదు

TV9 Telugu

బీట్‌రూట్ కూడా ఒక సలాడ్ కూరగాయ. దీనిని అందరూ ఆరోగ్యకరమైన కూరగాయగా భావిస్తారు. భూమిలోపల పెరిగే ఈ కూరగాయలో భార లోహాలు, పురుగుమందులు ఉంటాయి. వీటిని పదేపదే కడిగినా తొలగించలేం. అందువల్ల తినే ముందు దీనిని తేలికగా ఆవిరిలో ఉడికించాలి

TV9 Telugu

బటన్ మష్రూమ్స్‌ (పుట్టగొడుగులు)ను శాండ్‌విచ్‌లలో పచ్చిగా ఉపయోగిస్తారు. కానీ అవి పచ్చిగా ఉన్నప్పుడు జీర్ణం కావడం కష్టం. వీటిల్లో విషపూరితమైనవి కూడా ఉంచవచ్చు. కాబట్టి వాటిని తినే ముందు ఉడికించాలి

TV9 Telugu

ఐరన్‌కు అద్భుతమైన మూలంగా పరిగణించబడే ఒక ఆకుకూర పాలకూర. దీనిని తరచుగా సలాడ్లతో పచ్చిగా తింటారు. ఇందులో ఆక్సలేట్లు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి దీనిని పచ్చిగా తినడం అంత మంచిది కాదు. ఆక్సలేట్లు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. ఐరన్‌ శోషణను కూడా నిరోధిస్తాయి

TV9 Telugu

కూరగాయల మాదిరిగానే మొలకలను కూడా పచ్చిగా తినకూడదు. మొలకలు తేమతో కూడిన, వెచ్చని ఉష్ణోగ్రతలలో పెరుగుతాయి. అటువంటి వాతావరణంలోనే ఇ. కోలి, సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అందువల్ల మొలకలను ఎల్లప్పుడూ ఆవిరి మీద ఉడికించాలి