ఈ ఆకులు మీ ఇంటి వైద్యుడు.. నిర్లక్ష్యం వద్దండోయ్‌

09 April 2026

TV9 Telugu

TV9 Telugu

దాదాపు ప్రతి ఇంటి పెరట్లో మున‌గ చెట్టు తప్పక ఉంటుంది. ఈ ఒక్క చెట్టుతో మన ఒంట్లో ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు

TV9 Telugu

మునగాకుల్లో అత్యంత శక్తివంతమైన పోషకాలు నిండి ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇవి విస్తృతంగా గుర్తింపు పొందాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ సమృద్ధిగా ఉంటాయి

TV9 Telugu

మునగాకులోని విటమిన్ సి పరిమాణం నారింజ పండ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటిల్లో కాల్షియం కూడా పాల‌ కంటే ఎక్కువగా ఉంటుందట

TV9 Telugu

పోషకాలతో నిండిన ఈ ఆకుల్లో ఐరన్‌, ప్రోటీన్‌ కూడా ఎక్కువే. అందుకే రోజువారీ ఆహారంలో మునగాకు చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి

TV9 Telugu

మునగాకు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాయపడుతుంది. మునగాకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది

TV9 Telugu

వీటిలో ఉన్న అధిక ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ (ఫైటోస్టెరాల్స్) జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్‌ను బంధించి బయటకు పంపడంలో సహాయపడతాయి. దీని వల్ల ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిలు తగ్గే అవకాశాలు ఉంటాయి

TV9 Telugu

రక్తపోటు నియంత్రణలో కూడా మునగాకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం రక్తనాళాలను సడలించి సోడియం స్థాయిలను సమతుల్యం చేయడం ద్వారా హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి

TV9 Telugu

అదనంగా క్వెర్సెటిన్, నియాజిమిసిన్ వంటి బయో యాక్టివ్ పదార్థాలు సహజ వాసోడైలేటర్లుగా పనిచేసి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణలో కూడా మునగాకు ఉపయోగకరంగా ఉంటుంది