సామాజిక మాధ్యమాల సంస్థలతో ఈసీ భేటీ
న్యూఢిల్లీ : సోషల్ మీడియా సంస్థలతో ఇవాళ ఎన్నికల సంఘం ఢిల్లీలో భేటీకానున్నది. లోక్‌సభ ఎన్నికల వేళ ఎలాంటి నియమావళిని పాటించాలన్న అంశంపై సోషల్ మీడియా సంస్థలకు ఎన్నికల సంఘం సూచనలు చేయనున్నది. నిజానికి ఎన్నికల తేదీలు ప్రకటించడంతో.. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునిల్ ఆరోరా కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చిన విషయం […]
న్యూఢిల్లీ : సోషల్ మీడియా సంస్థలతో ఇవాళ ఎన్నికల సంఘం ఢిల్లీలో భేటీకానున్నది. లోక్‌సభ ఎన్నికల వేళ ఎలాంటి నియమావళిని పాటించాలన్న అంశంపై సోషల్ మీడియా సంస్థలకు ఎన్నికల సంఘం సూచనలు చేయనున్నది. నిజానికి ఎన్నికల తేదీలు ప్రకటించడంతో.. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునిల్ ఆరోరా కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సంస్థల ప్రతినిధులతో ఈసీ భేటీకానున్నది.