AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan : ఇషాన్ కిషన్ కీపింగ్ తిప్పలు..సెంచరీ కొట్టినా దక్కని గ్యారెంటీ..సంజూ శాంసన్‌కు ప్లస్ అవుతుందా?

Ishan Kishan : టీ20 వరల్డ్ కప్ 2026 ముంగిట టీమిండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం ఆసక్తికర పోరు సాగుతోంది. సుమారు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ పరుగుల సునామీ సృష్టిస్తుంటే, సంజూ శాంసన్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అయితే కేవలం బ్యాటింగ్ గణాంకాలను చూసి ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం అంత సులభం కాదని తాజా మ్యాచ్ నిరూపించింది.

Ishan Kishan : ఇషాన్ కిషన్ కీపింగ్ తిప్పలు..సెంచరీ కొట్టినా దక్కని గ్యారెంటీ..సంజూ శాంసన్‌కు ప్లస్ అవుతుందా?
Ishaan Kishan Vs Sanju Samson
Rakesh
|

Updated on: Feb 01, 2026 | 4:31 PM

Share

Ishan Kishan : టీ20 వరల్డ్ కప్ 2026 ముంగిట టీమిండియాలో వికెట్ కీపర్ స్థానం కోసం ఆసక్తికర పోరు సాగుతోంది. సుమారు రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ పరుగుల సునామీ సృష్టిస్తుంటే, సంజూ శాంసన్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అయితే కేవలం బ్యాటింగ్ గణాంకాలను చూసి ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం అంత సులభం కాదని తాజా మ్యాచ్ నిరూపించింది. ఇషాన్ కిషన్ చేసిన ఒక చిన్న తప్పు, సంజూ శాంసన్ కెరీర్‌కు ఊపిరి పోసేలా కనిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ కోసం బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అదరగొట్టాడు. ముఖ్యంగా చివరి మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ సిరీస్ మొత్తంలో 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 215 పరుగులు చేసి టాప్ ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ప్రధాన కీపర్ సంజూ శాంసన్ 5 మ్యాచ్‌ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో వరల్డ్ కప్ తుది జట్టులో సంజూ స్థానంలో ఇషాన్ రావడం ఖాయమని అందరూ భావించారు.

కానీ తిరువనంతపురం మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టినప్పుడు అసలు సమస్య మొదలైంది. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన ఇషాన్, వికెట్ల వెనుక మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. మ్యాచ్ గెలిచినప్పటికీ, ఇషాన్ రెండు సులువైన స్టంపింగ్ అవకాశాలను జారవిడిచాడు. 9వ ఓవర్లో ప్రమాదకరమైన ఫిన్ అలెన్‌ను స్టంప్ చేసే ఛాన్స్ మిస్ చేయగా, 17వ ఓవర్లో ఈష్ సోధిని కూడా అవుట్ చేయలేకపోయాడు. అంతేకాకుండా ఈ ఒక్క మ్యాచ్‌లోనే బైస్ రూపంలో 8 అదనపు పరుగులు ఇచ్చాడు. సంజూ శాంసన్ గత నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే అదనంగా ఇవ్వడం ఇక్కడ గమనార్హం.

వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలలో ఒక్క క్యాచ్ లేదా ఒక స్టంపింగ్ మిస్ అయినా మ్యాచ్ ఫలితమే మారిపోతుంది. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఫామ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, కీపింగ్‌లో అతని తడబాటు టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది. తిలక్ వర్మ ఫిట్‌గా తిరిగి రావడం కూడా సంజూకు ఇబ్బందిగా మారినా, ఇషాన్ కీపింగ్ లోపాలు సంజూకు వరల్డ్ కప్‌లో తుది జట్టులో చోటు దక్కేలా చేసే అవకాశం ఉంది. కేవలం బ్యాటర్ గానే ఇషాన్ ను ఆడించాలంటే జట్టులో చోటు లేదు, కీపర్ గా ఆడించాలంటే నమ్మకం కుదరడం లేదు. దీంతో సంజూ శాంసన్ తన స్థానాన్ని కాపాడుకునే అవకాశాలు మెరుగుపడ్డాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..