AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు వైద్యుల పరీక్షలు

తన కార్యాలయంలోనే నిర్బంధ నిరాహారదీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు వైద్యుల పరీక్షలు
Balaraju Goud
| Edited By: |

Updated on: Oct 27, 2020 | 9:40 PM

Share

తన కార్యాలయంలోనే నిర్బంధ నిరాహారదీక్షకు దిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సోమవారం దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా సిద్దిపేటలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ ఆయన దీక్షకు పూనుకున్నాడు. సంజయ్ ఆరోగ్యం స్వల్ఫంగా క్షిణించిందని, ఆయన శరీరంలోని షుగర్‌ లెవల్స్‌ పడిపోతుండటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, బీజేపీ అధిష్ఠానం సంజయ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఆయన్ను పరామర్శించేందుకు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు కరీంనగర్‌ చేరుకుంటున్నారు.

బండి సంజయ్ ఆరోగ్యం క్షిణిస్తుండటంతో ఆయన కార్యాలయానికి చేరుకున్న పోలీసులు.. ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆయన షుగర్ లెవెల్స్ తగ్గిపోవడటంతో ప్రభుత్వ వైద్యులు ప్లూయిడ్స్ ఎక్కించారు. అనంతరం సంజయ్‌ను మెరుగైన వైద్యం కోసం అపోలో రీచ్ ఆస్పత్రికి తరలించారు.

నిన్న పోలీసులు జరిపిన దాడుల్లో సిద్ధిపేటలోని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువు ఇంట్లో లక్షల రూపాయల నగదు బయటపడింది. ఈ నేపథ్యంలో దుబ్బాక వెళ్తున్న తనపై సిద్దిపేట పోలీసు కమిషనర్‌ దౌర్జన్యం చేసి చేయి చేసుకున్నారని, ఆయన్ని బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తూ సంజయ్‌ దీక్ష చేపట్టారు. సీపీని బదిలీ చేసి ఆయనపై కేసు నమోదు చేసేవరకు తన కార్యాలయంలోనే ఉంటానని ప్రకటించి దీక్షకు దిగారు. బయటి నుంచి తాళం వేసుకుని నిన్న రాత్రి నుంచి కార్యాలయంలో నేలపైనే దీక్ష కొనసాగిస్తున్నారు.

Follow Us
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
2వ మ్యాచ్‌కు ముందే టీమిండియాకు 2 శుభవార్తలు, ఒక డేంజరస్ అలర్ట్.!
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? గరుడ పురాణం ప్రకారం తొలి 13
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
TET 2026కు భారీ స్పందన.. 56 వేల ఇన్‌-సర్వీస్ టీచర్ల దరఖాస్తులు
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
ఈసారి వానలు పడవా? జూలైలో ఆకాశం చూడాల్సిందేనా?
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం.. 3 యాప్‌లపై నిషేధం!
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
మన పూర్వీకులంతా బలంగా ఉక్కులా ఉండడానికి వారు తాగిన డ్రింక్ ఇదే
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఇక దేశ వ్యాప్తంగా NEETకు స్వస్తి.. బోర్డు పరీక్షలకు 50% వెయిటేజీ
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
ఈ ఏడాది ఫోన్ రేట్లు తగ్గుతాయా..? తెరపైకి కొత్త ప్రతిపాదన..
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..
ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో ఆస్పత్రి మెట్లు..