నామినేషన్ల దాడిని తట్టుకోగలరా? అంటే కవిత ఏమన్నారో తెలుసా?

నామినేషన్ల దాడిని తట్టుకోగలరా? అంటే కవిత ఏమన్నారో తెలుసా?

హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 200 మందికి పైగా రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల దాడిని తట్టుకుని నిలబడగలరా అని అడిగితే నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు. టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రైతుల కోపం తన మీద కాదని, జాతీయ పార్టీల మీద అని చెప్పారు. జాతీయ స్థాయిలో ఇది వార్త అవ్వాలనే ఉద్దేశంతోనే నామినేషన్ వేశారని చెప్పారు. […]

Vijay K

|

Mar 26, 2019 | 7:45 PM

హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 200 మందికి పైగా రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల దాడిని తట్టుకుని నిలబడగలరా అని అడిగితే నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో స్పందించారు.

టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. రైతుల కోపం తన మీద కాదని, జాతీయ పార్టీల మీద అని చెప్పారు. జాతీయ స్థాయిలో ఇది వార్త అవ్వాలనే ఉద్దేశంతోనే నామినేషన్ వేశారని చెప్పారు. నామినేషన్ల ద్వారా తమ నిరసన తెలియజేయడమనేది రైతుల హక్కు అని అన్నారు. అయితే ఎలక్షన్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితి లేకుండా ఉండేందుకు నామినేషన్లు వెనక్కి తీసుకునేలా తాము పలువురు రైతులతో చర్చించామని కవిత తెలిపారు. సమస్య హైలెట్ కావడమే తమ ఉద్దేశ్యమని, నామినేషన్ విరమించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రైతులు చెప్పినట్టు కవిత తెలిపారు.

నిజామాబాద్‌లో రైతులు నామినేషన్ దాఖలు చేసిన విధంగానే రాహుల్ గాంధీ, మోడీపైన కూడా వేద్దామని, అప్పుడు మన సమస్య జాతీయ స్థాయిలో మరింత హైలెట్ అవుతుందని రైతులకు కవిత సూచించారు.

అసలు రైతుల డిమాండ్లు ఏమిటి? మూడు ప్రధాన అంశాలున్నాయి.. 1) ఎర్ర జోన్నలకు గిట్టుబాటు ధర రావాలి. 2) పసుపు పంటకు గిట్టుబాటు ధర రావాలి. 3) పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu