మోడీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు- కేజ్రీవాల్

మోడీ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు- కేజ్రీవాల్

వచ్చే ఎన్నికలు దేశానికి, ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమైనవని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభకు ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. ఐదేళ్ళ క్రితం అవినీతి రహిత పాలన అందిస్తామని మోడీ, అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబును మరోసారి సీఎంగా చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.  ఆర్బీఐ, సీబీఐ, ఈడీ వంటి […]

Ram Naramaneni

|

Mar 31, 2019 | 8:25 PM

వచ్చే ఎన్నికలు దేశానికి, ఆంధ్రప్రదేశ్ కు ఎంతో ముఖ్యమైనవని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆదివారం విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభకు ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. ఐదేళ్ళ క్రితం అవినీతి రహిత పాలన అందిస్తామని మోడీ, అమిత్ షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబును మరోసారి సీఎంగా చేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు.  ఆర్బీఐ, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను మోడీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు పేరుతో దేశ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని కేజ్రీవాల్ అన్నారు. మోడీ పాలన హిట్లర్ పాలనను తలపిస్తుందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేశారని అన్నారు. మోడీ, అమిత్ షా జోడి నుంచి దేశాన్ని కాపాడాలని మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను అని కేజ్రీవాల్ విశాఖ టీడీపీ ప్రచార సభలో వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో కుల, మత విద్వేషాలు ఎక్కువ అయ్యాయని ఆరోపించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu