అనితా ఓ అనితా..! నీ సెగ్మెంట్ ఎక్కడ?

గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఫైర్‌బ్రాండ్‌గా చక్రం తిప్పిన మహిళా నేత వంగలపూడి అనిత. విశాఖ జిల్లా పాయకరావుపేట స్ధానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా 2014లో పోటీచేసి గెలిచిన ఈమె.. అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీ మహిళా నేత రోజాపై అసెంబ్లీలో చేసిన రచ్చ ఇప్పటికీ మర్చిపోలేని ఘటన. అయితే 2019 నాటికి ఆమె పరిస్థితి తారుమారైంది. పాయకరావుపేట నుంచి పశ్చిమ గోదావరి […]

అనితా ఓ అనితా..! నీ సెగ్మెంట్ ఎక్కడ?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 18, 2019 | 8:25 PM

గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఫైర్‌బ్రాండ్‌గా చక్రం తిప్పిన మహిళా నేత వంగలపూడి అనిత. విశాఖ జిల్లా పాయకరావుపేట స్ధానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా 2014లో పోటీచేసి గెలిచిన ఈమె.. అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీపై తీవ్రస్ధాయిలో విమర్శలు చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా వైసీపీ మహిళా నేత రోజాపై అసెంబ్లీలో చేసిన రచ్చ ఇప్పటికీ మర్చిపోలేని ఘటన. అయితే 2019 నాటికి ఆమె పరిస్థితి తారుమారైంది. పాయకరావుపేట నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి మార్చేశారు. పాయకరావుపేటలో ఆమెకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆమెకు కొవ్వూరు స్ధానాన్ని ఇవ్వాల్సి వచ్చింది. అయితే కొవ్వూరు సిట్టింగ్ స్ధానంలో ఉన్న అప్పటి మంత్రి జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరుకు షిఫ్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలు ఓటమి పాలుకావడంతో ఇక ఎవరి సొంత నియోజకవర్గాలకు వారు పరిమితం కావాల్సి వచ్చింది.

పాయకరావుపేట స్ధానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వంగలపూడి అనితకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిపడింది. తనకో సీటు కావాలని కోరుకుంటున్నారు. పుట్టినిల్లు పాయకరావుపేటలో ఇప్పటికే స్థానం కోల్పోయిన అనిత.. కనీసం మెట్టినిల్లు కొవ్వూరులోనైనా నిలబడదామనుకుంటే అక్కడ జవహర్ ఉండటంతో భంగపాటు తప్పలేదు. ఈ పరిస్థితులో రాజకీయంగా ఆమెది ఏ స్ధానమో అర్ధం కాక సతమతమవుతున్నారు.

విశాఖలో ఈనెల 11 నిర్వహించిన సమీక్ష సమావేశంలోనైనా ఓ క్లారిటీ వస్తుందని అనుకుంటే అక్కడకూడా పార్టీ అధినేత నుంచి సరైన స్పష్టత రాకపోయేసరికి ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో నిరాశతో ఉన్నారు అనిత. మొత్తానికి ఈ రెండు స్ధానాల్లో తన సీటు గల్లంతు కావడంతో పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందోనని అనిత హైరానా పడుతున్నారు. పాపం అనిత పరిస్థితి.. రెంటికీ చెడ్డ రేవడిగా తయారైందని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.