చరిత్రపై చిచ్చు.. చెరిపేస్తారా ? తిరగరాస్తారా ?

చరిత్రపై చిచ్చు.. చెరిపేస్తారా ? తిరగరాస్తారా ?

మనం చదువుకున్నది.. మన చరిత్ర కాదా..?   బ్రిటిషర్ల దృష్టితో రాసిన చరిత్రేనా ఇది?  ఇతిహాసాన్ని పరిహాసంగా మార్చారా..?  అసలు మన చరిత్ర ఏంటి..? ఎక్కడ మొదలైంది..? ఎవరితో ముగిసింది..? దేశం కోసం పోరాడిన వీరుల్లో కొందరిని మరిచామా..? మొఘలులు, బ్రిటిషర్లు, లెఫ్ట్‌ వాదుల కనుసన్నల్లోనే మన చరిత్ర లిఖించబడిందా..? దేశానికి ఉన్న ఆత్మను.. భారతీయతను చంపేశారా..? కేంద్ర హోంమంత్రి.. అమిత్‌షా.. మాటల వెనుక దాగున్న అర్థమేంటి… దేశం మీసం తిప్పిన వీరులెందరో.. దేశ స్వాతంత్ర్యం కోసం […]

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Oct 18, 2019 | 8:14 PM

మనం చదువుకున్నది.. మన చరిత్ర కాదా..?   బ్రిటిషర్ల దృష్టితో రాసిన చరిత్రేనా ఇది?  ఇతిహాసాన్ని పరిహాసంగా మార్చారా..?  అసలు మన చరిత్ర ఏంటి..? ఎక్కడ మొదలైంది..? ఎవరితో ముగిసింది..? దేశం కోసం పోరాడిన వీరుల్లో కొందరిని మరిచామా..? మొఘలులు, బ్రిటిషర్లు, లెఫ్ట్‌ వాదుల కనుసన్నల్లోనే మన చరిత్ర లిఖించబడిందా..? దేశానికి ఉన్న ఆత్మను.. భారతీయతను చంపేశారా..? కేంద్ర హోంమంత్రి.. అమిత్‌షా.. మాటల వెనుక దాగున్న అర్థమేంటి…

దేశం మీసం తిప్పిన వీరులెందరో.. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులెందరో… ప్రాణాలను సైతం అర్పించిన భరతమాత ముద్దుబిడ్డలెందరో…. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. 1957 సిపాయిల తిరుగుబాటు. ఇది చరిత్ర పుస్తకాల్లో మనం చదువుకున్న ముఖ్యపాఠం. ఇక్కడి నుంచే భారతదేశ స్వాతంత్ర పోరాటం మొదలైందన్నది చరిత్రలో లిఖించబడింది. ఈ ఘనత మొత్తం సావర్కర్‌కే చెందుతుందన్నారు అమిత్‌షా.

బ్రిటిషర్లు మొఘలుల కాలంలో చరిత్రను వక్రీకరించారన్నది అమిత్‌షా పరోక్ష వాదన. చరిత్రను వారి కోణం నుంచే లిఖించారని… దీన్ని ఇప్పుడు భారతీయుల కోణం నుంచి తిరగరాయాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు. భరతఖండ చరిత్ర అంటే దేశ స్వాతంత్ర్య సంగ్రామమే కాదు..అంతక ముందు ఎంతో ఉందన్నది వారి వాదన.

బెనారస్‌ హిందూ యూనివర్సిటీని స్థాపించిన పండిట్‌ మదన్‌ మోహన్‌ మాలవ్యా గురించి చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ఆయన స్వాతంత్రానంతరం దేశ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఇక గుప్త సామ్రాజ్యపు స్కంధగుప్తుని చరిత్ర ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు షా. ఆయన హూనా సామ్రాజ్యాన్ని ఓడించి అఫ్గనిస్తాన్‌ వరకు హస్తగతం చేసుకున్నాడన్నారు. అలాంటి గొప్ప యోధుడి గురించి చరిత్ర మర్చిపోవడం బాధాకరమన్నారు.

స్కంధగుప్తుడి వంటి పరిపాలకులు 200మంది వరకు ఉన్నారని.. వారి చరిత్రను వెలికి తీసి భావితరాలకు అందించాలంటున్నారు షా. ఇప్పుడున్న చరిత్రను తిరగరాసి… బ్రిటిషన్లు, మొఘలులను పక్కకి నెట్టాలన్నది ఆయన వాదన. అయితే.. ప్రతిపక్షాలు మాత్రం ఆయన మాటలను తప్పుబడుతున్నాయి. దేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారని.. దేశ నిర్మాణంలో అందరి పాత్రా ఉందని అంటున్నారు. కేవలం హిందూ రాజులను ఎత్తి చూపి.. మిగిలిన వారిని తక్కువ చేయాలని చూస్తే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అంటున్నారు. మరి ఈ చరిత్ర పాఠాలు.. వాటి పర్యవసానాలు ఎక్కడి వరకు వెళ్తాయో వేచి చూడాల్సిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu