AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పార్లమెంట్ సమావేశాలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం.. లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధాన చర్చ

పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తాలని నిర్ణయించారు తెలంగాణ నేతలు. దేశంలో పెరిగిన అవినీతిని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు..

పార్లమెంట్ సమావేశాలపై తెలంగాణ కాంగ్రెస్ వ్యూహం.. లేవనెత్తాల్సిన అంశాలపై ప్రధాన చర్చ
Sanjay Kasula
|

Updated on: Jan 26, 2021 | 10:29 PM

Share

Congress Parliamentary Party meet : హైదరాబాద్‌ గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, కుసుమకుమార్‌, జగ్గారెడ్డి, మధుయాష్కీ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ మీటింగ్‌లో ప్రధానంగా చర్చించారు.

పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధానంగా మూడు అంశాలను లేవనెత్తాలని తెలంగాణ నేతలు నిర్ణయించారు . దేశంలో పెరిగిన అవినీతిని పార్లమెంట్‌లో టీపీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తావిస్తామన్నారు. బీజేపీ.. టీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఏడేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతి ఆరోపణలపై విచారణ ఎందుకు జరపలేదో నిలదీస్తామన్నారు ఉత్తమ్‌.

హైదరాబాద్‌-విజయవాడ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ కోసం డిమాండ్‌ చేయాలని నిర్ణయించారు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టమెంటరీ పార్టీ నేతలు. విభజన చట్టం ప్రకారం కాజీపేట రైల్వేకోచ్‌, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ఏర్పాటుచేయాలని పార్లమెంట్‌లో డిమాండ్‌ చేస్తామన్నారు నేతలు. కోవిడ్‌ విషయంలో రాష్ట్ర వైఫల్యాలను కూడా పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Bharatha Matha Maha Harathi : వైభవంగా భారత మాత మహా హారతి.. ఆకట్టుకున్న సాంస్కృతి కార్యక్రమాలు

Prasanta Dora Passes Away : భారత సాకర్ మాజీ​ గోల్​కీపర్ ప్రశాంత్​ డోరా కన్నుమూత..