మోడీ పై చంద్రబాబు విమర్శలు..!

నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉంటూ దొంగలకు కాపలాదారుడుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్రంగా ఆరోపించారు. కోడికత్తితో జగన్‌ పొడిపించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అదొక ప్రపంచ సమస్యలా ఎంక్వైరీ వేసిందని ఎద్దేవా చేశారు. అలాగే ఇంట్లో మనిషిని చంపుకుని  రాజకీయాలు చేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో కడప వైసీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఇన్వాల్‌ అయ్యారని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని దొంగ ఎత్తుగడలు వేసినా నేరస్తులెవరో బయటపెట్టి తీరుతామని హెచ్చరించారు. మోదీ, అమిత్‌షా కలిసి దేశాన్ని భ్రష్టు […]

  • Ravi Kiran
  • Publish Date - 3:39 pm, Thu, 28 March 19
మోడీ పై చంద్రబాబు విమర్శలు..!

నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉంటూ దొంగలకు కాపలాదారుడుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు తీవ్రంగా ఆరోపించారు. కోడికత్తితో జగన్‌ పొడిపించుకుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అదొక ప్రపంచ సమస్యలా ఎంక్వైరీ వేసిందని ఎద్దేవా చేశారు. అలాగే ఇంట్లో మనిషిని చంపుకుని  రాజకీయాలు చేయాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వివేకా హత్య కేసులో కడప వైసీపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఇన్వాల్‌ అయ్యారని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని దొంగ ఎత్తుగడలు వేసినా నేరస్తులెవరో బయటపెట్టి తీరుతామని హెచ్చరించారు. మోదీ, అమిత్‌షా కలిసి దేశాన్ని భ్రష్టు పట్టించాలనుకుంటున్నారని మండిపడ్డారు. స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోనివ్వడం లేదన్న చంద్రబాబు… జగన్‌లాంటి వాళ్లను తిప్పికొట్టాలంటే జనం నుంచి విప్లవం రావాలని చెప్పారు.

మరోవైపు ఈవీఎంలను ట్యాంపర్‌ చేస్తున్నారని.. అంతేకాకుండా వారికీ ఇష్టానుసారంగా ఓట్లు వేసుకుని గెలిచి మరీ.. అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎవరికి ఓటు వేస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేసిన తర్వాత ఈవీఎంల నుంచి స్లిప్‌ వచ్చేలా పోరాడుతున్నాం అని చెప్పారు. ఇప్పుడు వీవీప్యాట్‌లు లెక్కించేలా సుప్రీంకోర్టులో కేసు వేశామని, విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.