బిజూ జనతా దళ్‍కు సీనియర్ నేత గుడ్‍బై

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలోని అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ)కు గట్టి దెబ్బ తగిలింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత అర్జున్ చరణ్ సేథి శనివారంనాడు బీజేడీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ సమక్షంలో స్థానిక బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కండువాను అర్జున్ చరణ్ సేథి కప్పుకున్నారు. అయితే తన రాజీనామాకు దారితీసిన కారణాలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేపీ […]

బిజూ జనతా దళ్‍కు సీనియర్ నేత గుడ్‍బై
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2019 | 8:48 PM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలోని అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ)కు గట్టి దెబ్బ తగిలింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఆరుసార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ నేత అర్జున్ చరణ్ సేథి శనివారంనాడు బీజేడీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రథాన్ సమక్షంలో స్థానిక బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ కండువాను అర్జున్ చరణ్ సేథి కప్పుకున్నారు.

అయితే తన రాజీనామాకు దారితీసిన కారణాలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేపీ నేత నవీన్ పట్నాయక్‌కు అర్జున్ చరణ్ సేథి లేఖ రాశారు. ‘గత కొద్ది నెలలుగా నేను మిమ్మల్ని పలుమార్లు కలిశాను. వయోభారం కారణంగా నాకు బదులు నా కుమారుడికి భద్ర లోక్‌సభ సీటు ఇవ్వాలని నేను కోరడం, మీరు హామీ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తూ తుది జాబితాలో నా కుమారుడి పేరు తొలగించారు. నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. నవీన్ నివాస్ వద్ద గంటల తరబడి నిరీక్షించాను. అయితే కొందరు పలుకుబడి కలిగిన పార్టీ నేతలు మిమ్మల్ని కలుసుకునే అవకాశం నాకు ఇవ్వలేదు’ అని ఆ లేఖలో సేథి వాపోయారు. బిజూ బాబు ఏర్పరచిన నీతినియమావళిని కానీ, సిద్ధాంతాలను కానీ బీజేడీ పార్టీ మరిచిపోయిందని, బీజేడీకి ఇంక తన అవసరం లేదనే విషయం స్పష్టమైందని, ఇది వృద్ధాప్యంలో తనకు పార్టీ ఇచ్చిన గట్టి షాక్ అని ఆ లేఖలో సేథి పేర్కొన్నారు. కాగా, సేథి కుమారుడు అభిమన్యు కూడా బీజేపీలో చేరారు.