జగన్ చెప్పినట్టే.. తన పదవికి రాజీనామా చేసి.. పార్టీ మారిన కారెం..!

మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ.. టీడీపీకి షాక్ ఇచ్చి. సీఎం జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం.. జగన్ క్యాంపు కార్యాలయంలో.. పార్టీ అధినేతను కలుసుకుని వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా.. కారెం శివాజీతో పాటు మరికొందరు మాల మహానాడు మాజీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ప్రతినిధులు కూడా వైసీపీలో చేరారు. కాగా.. ఇదివరకు సీఎం జగన్.. తమ పార్టీలోకి రావాలంటే.. […]

జగన్ చెప్పినట్టే.. తన పదవికి రాజీనామా చేసి.. పార్టీ మారిన కారెం..!
Follow us

| Edited By:

Updated on: Nov 29, 2019 | 10:21 PM

మాల మహానాడు మాజీ అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ.. టీడీపీకి షాక్ ఇచ్చి. సీఎం జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం.. జగన్ క్యాంపు కార్యాలయంలో.. పార్టీ అధినేతను కలుసుకుని వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతేకాకుండా.. కారెం శివాజీతో పాటు మరికొందరు మాల మహానాడు మాజీ నాయకులు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ప్రతినిధులు కూడా వైసీపీలో చేరారు.

కాగా.. ఇదివరకు సీఎం జగన్.. తమ పార్టీలోకి రావాలంటే.. తమతమ పదవులకు రాజీనామా చేసి..రావాలంటూ.. ఆంక్ష పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో.. గురువారం కారెం శివాజీ తన పదవికి రాజీనామా చేశారు.

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు.. సీఎంగా ఉన్నప్పుడు కారెం శివాజీ.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. అనంతరం.. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆయన అదే పదవిలో కొనసాగారు. అయితే.. తాజాగా.. ఆయన పదవికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు.

Latest Articles