Pawan: పవన్ కళ్యాణ్‌కు రాజకీయ చతురత ఏముంది? అతను పరిణితి చెందిన రాజకీయవేత్త కాదు: ఏపీ డిప్యూటీ సీఎం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణకు రాజకీయ చతురత, అనుభవం ఏముందని సూటిగా ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. పవన్ కళ్యాణ్
Dharmana Krishna Das – Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణకు రాజకీయ చతురత, అనుభవం ఏముందని సూటిగా ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. పవన్ కళ్యాణ్ పరిణితి చెందిన రాజకీయవేత్త కాదని, పవన్ నామమాత్రమైన ఓట్లు మాత్రమే ప్రభావితం చేయగల నాయకుడని ధర్మాన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి అనవసరంగా పెద్దవాడిని చేస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు.
రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి గురించి ఇన్నిసార్లు మాట్లాడాల్సిన అవసరం లేదని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పవన్‌కు స్థిరత్వం లేదని, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు వేయించాడని ఆయన శ్రీకాకుళంలో ఎద్దేవా చేశారు.
అసందర్భ ప్రేలాపన, అవసరం లేని వాగుడు పవన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ధర్మాన అన్నారు. పవన్ వ్యవహార శైలిని ప్రజలు హర్షించడం లేదని, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులే పవన్ కల్యాణ్‌ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందిన ఎద్దేవా చేశారు. తనకున్న అభిమానులతో కలిసి పార్టీ పెట్టి కాలక్షేపం చేస్తున్నాడని మండిపడ్డారు.
Read also: TDP: రూ. 231 కోట్లతో వైయస్ విగ్రహమా..? ప్రశ్నిస్తే బూతులు తిట్టిస్తారు: మాజీ మంత్రి దేవినేని ఉమ