- Telugu News Photo Gallery World photos These are some interesting facts about thailand and his capital bangkok and full name
దెయ్యాల కోసం ఇంట్లోనే ప్రత్యేక గది.. ఈ దేశ రాజధాని పేరు ప్రపంచంలోనే అతి పెద్దది.. ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..
ఈ ప్రపంచంలోనే అనేక దేశాలు ఉన్నాయి. అందులో ఆయా దేశాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే పర్వతాలు, మంచు కొండలు, నదులు, జలపాతాలు ఇలా అనేక అందమైన ప్రాంతాలున్నాయి. కానీ థాయ్‌లాండ్ దేశం ప్రత్యేకతలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.
Updated on: Aug 07, 2021 | 2:04 PM

థాయ్‌లాండ్ దేశాన్ని గతంలో సియామ్ అని పిలిచేవారు. 1948లో థాయ్లాండ్గా మార్చారు. ఈ దేశం బౌద్ధమత దేవాలయాలకు ప్రసిద్ది చెందింది. దాదాపు ఇక్కడ 95 శాతం మంది బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ రాముడు, విష్ణువులను పూజిస్తుంటారు.

. ఈ దేశ జాతీయ చిహ్నం గరుడ పక్షి. హిందూ సంప్రదాయంలో గరుడను విష్ణువు వాహనంగా భావిస్తాము. అలాగే థాయ్‌లాండ్ జాతీయ గ్రంథం రామ్ కియన్. అంటే రామాయణం థాయ్ వెర్షన్.

ఇక ఈ దేశ రాజధాని బ్యాంకాక్ ప్రపంచంలోనే అత్యంత హాటెస్ట్ నగరాలలో ఒకటి. ఇక్కడ ఏప్రిల్ నెలలో అత్యధిక వేడి ఉంటుంది. ఈ నెలలో సాంగ్‌క్రాన్ పండుగ జరుపుకుంటారు. ఇది హోలీ లాంటిది. కానీ రంగులకు బదులుగా నీరు మాత్రమే ఉపయోగిస్తారు.

ఇక్కడి ప్రజలకు దెయ్యాలు, ఆత్మల గురించి వింత నమ్మకం ఉంది. ఇక్కడ చాలామంది దెయ్యాలు, దయ్యాలను నివారించడానికి వారి ఇంట్లో ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తారు.

కృంగ్ దేవ్ మహానగర్ అమర రత్నకోసింద్ర మహీంద్రాయుధ్య మహతిలకభవ నవరత్న రాజధాని పురిరమ్య ఉత్తమ్‌రాగ్నివన్ మహాస్థాన్ అమరవిమాన్ అవతారస్థిత్య శక్రాదియ విష్ణుకర్మప్రసిద్ధి. ఇది బ్యాంకాక్ పూర్తి పేరు. ఇది పాలి, సంస్కృత భాష నుండి వచ్చింది.

దేశ రాజధాని పేరు ప్రపంచంలోనే అతి పెద్దది
