బీజింగ్ సహా ఉత్తర చైనాలోని 12 రాష్ర్టాలపై తుఫాన్ ప్రభావం కనిపించింది. కొన్ని చోట్ల ఎందుకైనా మంచిది అని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చైనాకి పశ్చిమ, ఉత్తరంవైపు మంగోలియాలో గోబి ఎడారి ఉంటుంది. అది చాలా పెద్దది. గత పదేళ్లలో ఇదే అత్యంత తీవ్రమైన ఇసుక తుఫాన్ అని అధికారులు తేల్చారు. దీని ప్రభావం కొన్ని రోజులపాటూ ఉంటుందని చెబుతున్నారు.