- Telugu News Photo Gallery World photos Miss World Beauties at Yadagari Lakshmi Narasimha Temple in Pochampally Sarees
ప్రపంచానికే అందం తెచ్చిన పోచంపల్లి చీరలు.. మిస్ వరల్డ్ బ్యూటీస్ ఎంత బాగున్నారో!
తెలగాణలో ప్రపంచ అందగత్తెలు సందడి చేస్తున్నారు. నిన్న వరంగల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన వీరు నేడు యాదగరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శనం చేసుకొని, పోచంపల్లి చీరల్లో అచ్చం తెలుగు అమ్మాయిల్లా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.మరి మీరు కూడా ఆఫొటోస్ చూసేయండి.
Updated on: May 17, 2025 | 2:21 PM

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు మిస్ వర్డ్ పోటీల కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ పోటీలకు 120 దేశాల అందత్తెలు పాల్గొన్నారు.

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 20 రోజుల పాటు మిస్ వర్డ్ పోటీల కార్యక్రమాలు జరగనున్నాయి.ఈ పోటీలకు 120 దేశాల అందత్తెలు పాల్గొన్నారు.

తర్వాత వరంగల్ వేయిస్తంభాల గుడి, రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ తెలంగాణ సంస్కృతి కట్టు బొట్టుతో అందంగా తయారై అందరినీ ఆకట్టుకున్నారు. అంతే కాకుండా అక్కడ బతుకమ్మ పాటలకు డ్యాన్స్ చేసి సందడి చేశారు.

ఇక రీసెంట్‌గా ప్రపంచ అందగత్తెలు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయడమే కాకుండా, పూచం పల్లి చీరల్లో అచ్చం తెలుగు అమ్మాయిల్లా రెడీ అయ్యి, వావ్ అనిపించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్ పోచంపల్లి చీరలు ప్రపంచానికే అందం తెచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ మే31న హైదరాబాద్‌లోని హైటెక్స్ సెంటర్‌లో జరగనున్న విషయం తెలిసిందే.



