- Telugu News Photo Gallery World photos Know the unlucky numbers of the world what are stories this numbers check here details
కొన్ని దేశాల్లో ఆ నెంబర్లను చూస్తేనే భయపడతారు.. ఎందుకో తెలుసా..
ప్రపంచంలో కొన్ని రకాల నమ్మకాలు ఉంటాయి. కొన్ని నంబర్లను శుభమని.. మరికొన్ని నంబర్లను అశుభమని భావిస్తారు. ఒక సంఖ్యను కొందరు దురదృష్టంగా భావిస్తే.. మరికొందరు అదృష్టంగా భావిస్తారు. అలా కొన్ని దేశాల్లో ఆ నెంబర్లను చూస్తేనే భయపడతారు. అవెంటో తెలుసుకుందామా.
Updated on: Dec 14, 2021 | 7:38 PM

చైనా, జపాన్, ఇటలీ, బ్రిటన్ వంటి దేశాల్లో కొన్ని నంబర్లను చెడుగా భావిస్తారు. ఆ సంఖ్యలను నివారించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి కొన్ని సంఖ్యలను దురదృష్టంగా భావించడానికి గల కారణాలు తెలుసుకుందామా.

చైనాలో 4న సంఖ్యను అశుభంగా భావిస్తారు. దీనిని ఇంగ్లీషులో ఫోర్ అంటారు. కానీ చైనీస్ భాషలో ఫోర్ అంటే మరణంగా పరిగణిస్తారు. అందుకే చైనాలోని భవనాల అంతస్తులలో 3 తర్వాత 5వ అంతస్తు అంటారు. భవనం లేదా వీధి పేరు 4గా నివారిస్తారు. జపాన్‌లోనూ 4 అశుభం. ఇక్కడ కూడా 3 తర్వాత 5ను లెక్కిస్తారు.

జపాన్‌లో 9వ సంఖ్యను కూడా అశుభంగా భావిస్తారు. ఇక్కడ ఆంగ్లంలో తొమ్మిది అంటారు. జపనీస్ భాషలో వ్యాధి లేదా మరణం అని అర్థం. అందుకే ఇక్కడ కూడా 9 అనే సంఖ్యను అశుభంగా భావిస్తారు. ఇక తొమ్మిదవ అంతస్తు లేదా నంబర్ ఉపయోగించరు.

ప్రపంచంలోని అనేక దేశాల్లో 13ని అశుభంగా భావిస్తారు. ఇక్కడి హోటల్స్, భవనాలలో 13వ అంతస్తు ఉండదు. విమానంలోనూ 13 నంబర్ సీటు కూడా ఉండదు. యేసుక్రీస్తుతో కలిసి విందు చేసిన వ్యక్తి అతడికి ద్రోహం చేశాడని.. అతడు 13వ నంబర్ కుర్చీలో కూర్చున్నాడని అందుకే ఆ నంబర్ అశుభమని భావిస్తారు.

ఇటలీలో 17వ నంబర్‌ను దురదృష్టంగా భావిస్తారు. 17ను రోమస్ సంఖ్యలో రాస్తే అది XVII. ఈ సంఖ్యను పునర్వ్యవస్థీకరించడం ద్వారా 'VIXI' అనే పదంగా మారుతుంది. దీని అర్థం లాటిన్‌లో 'నా జీవితం ఇప్పుడు పూర్తయింది'. అందుకే ప్రజలు ఈ నంబర్‌కు దూరంగా ఉంటారు. 17వ తేదీన అక్కడి ప్రజలు దుకాణాలు మూసి ఉంచుతారు.

ఇస్లామిక్ దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో 39వ సంఖ్య కూడా అశుభమైనదిగా భావిస్తారు. అక్కడ 39 అనే సంఖ్యను 'మోర్దా-గో' అంటే చనిపోయిన ఆవు అని అర్థం. అలాగే 'మోర్డా-గో' అనే పదాన్ని బ్రోకర్లకు కూడా ఉపయోగిస్తారు. అందుకే ఇక్కడి ప్రజలు ఈ నంబర్‌ను అశుభంగా భావిస్తారు.

ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు 536 సంఖ్యను దురదృష్టంగా భావిస్తారు. క్రీ.శ.536లో ప్రపంచంలో ఒక భయంకరమైన విపత్తు సంభవించిందని అంటారు. అప్పుడు ఒక రకమైన రహస్యమైన పొగమంచు ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని భాగాలను చాలా కాలం పాటు పగలు, రాత్రిని చుట్టుముట్టింది. అందువల్ల ఈ సంఖ్య అక్కడ అశుభమైనదిగా పరిగణించబడుతుంది.





























