- Telugu News Photo Gallery World photos Know the rare alien like fish with a translucent head spotted in 2000 feet below pacific ocean details here
పసిఫిక్ మహాసముద్రంలో ఏలియన్ జాడ.. చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు.. నెట్టింట్లో ఫోటోస్ వైరల్..
చాలాకాలంగా ఏలియన్స్ కోసం అంతరిక్షంలో శోధిస్తున్నారు శాస్త్రవేత్తలు. గత కొన్నేళ్లుగా గ్రహాంతరవాసుల జాడను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నిపుణులు. తాజాగా సముద్రంలో ఏలియన్స్ జాడ తెలిసింది.
Updated on: Dec 13, 2021 | 8:12 PM

కాలిఫోర్నియా తీరంలో పసిఫిక్ మహాసముద్రంలో గ్రహాంతరవాసుల లాంటి చేప సుమారు రెండు వేల అడుగుల దిగువన కనిపించింది. ఆ చేప తల అపారదర్శకంగా ఉంది. దాని కళ్లు మెరుస్తూ కనిపించాయి.

ఏలియన్స్ మాదిరిగా కనిపించే ఈ చేపను బ్యారెలీ ఫిష్ అంటారు. ఇది లోతైన సముద్ర జీవిని మాంటెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దాని రిమోట్ లీ ఆపరేటెడ్ వెహికల్ ను ఉపయోగించి గుర్తించింది. ఇన్స్టిట్యూట్ వాహనం 5600 సార్లు డ్రైవ్ చేసింది. కానీ ఆ వాహనం కేవలం తొమ్మిది సార్లు మాత్రమే కనిపెట్టింది.

చేపలు సాధారణంగా కళ్ళు ఉండే చోట రెండు చిన్న ఇండెంటేషన్లను కలిగి ఉంటాయి. కానీ చేప కళ్ళు దాని ముఖం వెనుక రెండు మెరుస్తున్న ఆకుపచ్చ రాళ్లలా కనిపిస్తాయి. దాని కళ్లపైన ఉండటం వల్ల దాని మీద ఉన్న నీటిని స్కాన్ చేయగలదు.. దీంతో ఆహారం కనుగోంటుంది. ఆ సమయంలో కళ్ళు కూడా ముందుకు వస్తాయి.

కాలిఫోర్నియా తీరంలోని మాంటెరీ బేలో రాచెల్ కార్సన్ నేతృత్వంలోని యాత్రలో గత వారం గ్రహాంతరవాసుల లాంటి బారెల్ ఫిష్ కనిపించింది. కానీ దాని గురించి 1939లో మొదటిసారిగా సమాచారం ఇవ్వబడింది. చేప శరీరంలో ఎక్కువ భాగం నల్లగా ఉంటుంది. కానీ తల పై భాగం పారదర్శకంగా ఉంటుం. దీని కారణంగా దాని కళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి.

జీవశాస్త్రవేత్తల ప్రకారం చేపలు వాటి కఠినమైన వాతావరణం కారణంగా శక్తివంతమైన దృష్టిని కలిగి ఉంటాయి. ఈ చేప లోతైన సముద్రంలో నివసిస్తుంది. ఇక్కడికి సూర్యకాంతి చేరుకోదు. దీని కళ్ళను గొట్టపు కళ్ళు అంటారు, ఇవి సాధారణంగా లోతైన సముద్ర జీవులలో కనిపిస్తాయి.

చేపల కళ్ళు తల పైన ఉన్నాయి. దీంతో అది లోతైన నీటిలో లేనప్పుడు, సూర్యకాంతి దాని కళ్ళలోకి పడవచ్చు. అందుకే తన కళ్ళను ముందుకు తీసుకురాగలదు.. ఈ కారణంగా ఎక్కడ ఈత కొడుతుందో చూడగలదు. చేపల కళ్ళు ప్రకాశవంతమైన ఆకుపచ్చ కాంతితో మెరుస్తాయి.





























