Rajitha Chanti |
Updated on: Aug 11, 2021 | 9:06 PM
ప్రపంచంలోనే అది చిన్నది రో నది. ఇది అమెరికాలోని మోంటానాలో ఉంది. ఈ నది పొడవు కేవలం 201 అడుగులు మాత్రమే. అంటే 61 మీటర్లు అని అర్థం. దాదాపు ఒక మాల్ లేదా 04-05 ఇళ్లు ఉన్నంత వరుసలో ఈ నది ప్రవహిస్తుంది.
ఈ నది పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రపంచంలోనే అతి చిన్న నదిగా ఎంపికయ్యింది. దీనిని నదిగా పరిగణించడానికి ప్రధాన కారణం.. దాని పెద్ద పరిమాణం.. లోతు కూడా.
అయితే ఈ నదిలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. నదిలో ఉన్న సున్నపు రాళ్ల కింద నుంచి నీరు ప్రవహిస్తాయని అంటుంటారు. భూమీ కింది నుంచి రావడం వలన ఇందులోని నీరు ఎండకాలంలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా ఉంటాయి.
ఈ నదితోపాటు.. ఒరేగాన్‌లో ప్రవహించే డి నదిని అతి నదిగా పరిగణిస్తారు. దాని పొడవు 130 మీటర్లు అంటే దాదాపు 440 అడుగులు..
ప్రపంచంలోని అతి చిన్న నది 'రో' నది.. కేవలం 61 మీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది.