- Telugu News Photo Gallery Winter Superfood: Pay Attention To Your Need For Seeds And Nuts To Stay Fit
Winter Superfood: చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహారాలు.. రోజూ క్రమం తప్పకుండా తినాలి
శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. జలుబు, దగ్గు, రుమాటిక్ నొప్పి, జ్వరం వంటి సమస్యలు దండెత్తుతాయి. ఈ కాలంలో శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే ఆహారాలు తీసుకోవాలి. అందుకు సీజనల్ ఆహారాలతో పాటు నట్స్, విత్తనాలు తినాలి. చలికాలంలో రోజూ 5-6 బాదంపప్పులు తినాలి. ఈ గింజ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. బాదంపప్పులో..
Updated on: Dec 11, 2023 | 9:05 PM

Nuts - బాదం, వాల్నట్స్, పల్లీలు, నువ్వులు, గుమ్మడిగింజలు వంటి నట్స్‌ను మీ డైట్లో కలిపి తీసుకోవచ్చు. ఇవి పూర్తిగా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలతో సమృద్ధిగా నిండి ఉంటాయి. కాబట్టి వీటిని సలాడ్స్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా కూడా తీసుకోవచ్చు. పైగా మీకు కాస్త క్రంచీ ఫీలింగ్‌ని ఇస్తాయి. కాబట్టి వీటిని రెగ్యూలర్‌గా మీ డైట్లో చేర్చుకోవచ్చు.

చలికాలంలో రోజూ 5-6 బాదంపప్పులు తినాలి. ఈ గింజ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. బాదంపప్పులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్, ఫాస్పరస్, మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

రోజూ ఆహారంలో నువ్వులు తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. నువ్వులలో జింక్, కాపర్, కాల్షియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉన్నాయి. అందుకే నువ్వులను శీతాకాలపు సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు

Nuts -భోజనం తర్వాత మీకు ఆకలిగా ఉన్నప్పుడల్లా గింజలు తీసుకోవడం వల్ల మీ ఆకలిని నియంత్రించవచ్చు. ఇవి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి, ఆయిల్ ఫుడ్స్, స్వీట్లు మొదలైన వాటిని తినకుండా నట్స్ తీసుకోవడం మంచిది. ఇందులో బాదం, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు వంటివి తీసుకోవటం ఉత్తమం. ఇలాంటి విత్తనాల్లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి.

చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే వాల్ నట్స్ తినండి. వాల్‌నట్స్‌లో కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో అవిసె గింజలు, చియా గింజలు తినడం మర్చిపోకూడదు. ఈ విత్తనాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.




