- Telugu News Photo Gallery Winter Diet Tips: Six Reasons Why Honey Milk Should Be A Part Of Your Winter Diet
Winter Diet Tips: రోగనిరోధక శక్తి పెంచుకోవాలా..? గ్లాసుడు పాలల్లో తేనె కలుపుకుని తాగారంటే..
పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా, శీతాకాలంలో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది బాదం, ఖర్జూరం వేడి పాలతో కలిపి తింటుంటారు. మరికొందరు చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకుని తాగుతారు. పాలల్లో పంచదారకు బదులు తేనెను కలుపుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు..
Updated on: Dec 13, 2023 | 7:35 PM

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా, శీతాకాలంలో ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొంతమంది బాదం, ఖర్జూరం వేడి పాలతో కలిపి తింటుంటారు. మరికొందరు చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలుపుకుని తాగుతారు. పాలల్లో పంచదారకు బదులు తేనెను కలుపుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.

పాలలో తేనె కలపడం వల్ల తీపి రుచి పెరగడే కాకుండా అనేక ప్రయోజనాలు కూడా అందిస్తాయి. తేనె కలిపిన పాలలో ప్రోటీన్, జింక్, విటమిన్ డి, విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

పాలు తేనె కలిపిన పాలు తాగడం వల్ల ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. దీనిలోని కాల్షియం, విటమిన్ డి బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది.

ఒక గ్లాసు పాలలో తేనె కలిపి తాగితే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఈ పానీయంలో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇది శక్తిని అందించడంలో సహాయపడుతుంది. చలికాలంలో జీర్ణకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే పాలల్లో తేనె కలుపుకుని తాగాలి. పాలల్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి తేనెలోని సూక్ష్మజీవులతో కలిసి జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి. ఇది మలబద్ధకం, గ్యాస్-గుండె మంట సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చలికాలంలో జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే తేనెతో పాలు కలుపుకుని తాగాలి. ఛాతీలో పేరుకున్న కఫం కూడా బయటకు వెళ్లిపోతుంది. చలికాలంలో చర్మ సమస్యలతో బాధపడేవారు తేనె కలిపిన పాలు తాగితే పరిష్కారం లభిస్తుంది. ఈ పానీయంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి. ఈ తేనెతో పాలను క్రమం తప్పకుండా తాగడం వల్ల చర్మం సహజ కాంతితో మెరుస్తుంది.





























