- Telugu News Photo Gallery Why eat black carrots in winter season? Do you know these secrets?, check here is details
Black Carrots Benefits: బ్లాక్ క్యారెట్స్ ని శీతా కాలంలో ఎందుకు తినాలి? ఈ సీక్రెట్స్ మీకు తెలుసా..
క్యారెట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా క్యారెట్స్ గురించి పరిచయాలు అవసరం లేదు. క్యారెట్స్ తింటే కంటి సమస్యలతో పాటు రక్త ప్రసరణ, జీర్ణ సమస్యలు, రక్త హీనత వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే బ్లాక్ క్యారెట్ గురించి మీకు తెలుసా..! శీతా కాలంలో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. ఈ క్యారెట్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ క్యారెట్స్ లో.. పొటాషియం, ఫైబర్, విటమిన్లు ఏ, సి, బి, మాంగనీస్ వంటి పోషకాలు ఉణ్నాయి. అయితే శీతా కాలంలో..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Dec 08, 2023 | 7:44 PM

క్యారెట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా క్యారెట్స్ గురించి పరిచయాలు అవసరం లేదు. క్యారెట్స్ తింటే కంటి సమస్యలతో పాటు రక్త ప్రసరణ, జీర్ణ సమస్యలు, రక్త హీనత వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే బ్లాక్ క్యారెట్ గురించి మీకు తెలుసా..! శీతా కాలంలో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. ఈ క్యారెట్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బ్లాక్ క్యారెట్స్ లో.. పొటాషియం, ఫైబర్, విటమిన్లు ఏ, సి, బి, మాంగనీస్ వంటి పోషకాలు ఉణ్నాయి. అయితే శీతా కాలంలో బ్లాక్ క్యారెట్స్ తినడం వల్ల చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ క్యారెట్స్ కంటే వీటిని తినడం వల్ల ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు.

నల్ల క్యారెట్ లను తినడం వల్ల గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఆంథోసైనిన్ గుండెను దృఢంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా బ్లాక్ క్యారెట్స్ తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. అదే విధంగా రక్త హీనత సమస్యతో బాధ పడేవారు బ్లాక్ క్యారెట్స్ తింటే మంచి ఫలితాలు ఉంటాయి.

అలాగే బ్లాక్ క్యారెట్స్ ను శీతా కాలంలో తినడం వల్ల బ్లడ్ లో షుగర లెవల్స్ కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్ ఉన్న వారు నల్ల క్యారెట్ ను మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. అంతే కాకుండా కళ్లకు కూడా చాలా మేలు చేస్తుంది బ్లాక్ క్యారెట్. ఈ క్యారెట్ తింటే కళ్ల సమస్యలు అన్నీ పోయి.. చూపు మెరుగ్గా ఉంటుంది.

బ్లాక్ క్యారెట్స్ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల కొంత మందిలో అలెర్జీ సమస్యలు తలెత్తవచ్చు. దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జీర్ణ సమస్యలు ఇలాంటివి తలెత్తవచ్చు. అలాగే కొంత మందిలో మలం, మూత్రం రంగు కూడా మారుతుంది. కాబట్టి అలెర్జీ సమస్యలు ఉన్న వారు దీనికి దూరంగా ఉండటమే బెటర్.





























