- Telugu News Photo Gallery White Sesame Vs Black Sesame Which is better to eat in summer? check here is details in Telugu
White Sesame vs Black Sesame: తెల్ల నువ్వులు Vs నల్ల నువ్వులు.. సమ్మర్‌లో ఏవి తింటే బెటర్?
నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది నువ్వుల్ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల నువ్వులు అయితే.. మరొకటి నల్ల నువ్వులు. తెల్ల నువ్వుల్ని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. నల్ల నువ్వుల్ని పితృ కార్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు. నువ్వుల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నువ్వుల్ని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ సమ్మర్‌లో ఖచ్చితంగా నువ్వులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నువ్వులు తీసుకోవడం వల్ల తక్షణమే..
Updated on: May 04, 2024 | 4:16 PM

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది నువ్వుల్ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల నువ్వులు అయితే.. మరొకటి నల్ల నువ్వులు. తెల్ల నువ్వుల్ని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. నల్ల నువ్వుల్ని పితృ కార్యాలకు ఉపయోగిస్తూ ఉంటారు.

నువ్వుల్లో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నువ్వుల్ని ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ సమ్మర్‌లో ఖచ్చితంగా నువ్వులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నువ్వులు తీసుకోవడం వల్ల తక్షణమే ఎనర్జీ, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

తెల్ల నువ్వులు తింటే ఎముకలు, గుండెకు, చర్మానికి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రక్త హీనత సమస్యకు చెక్ పెట్టాలంటే.. తెల్ల నువ్వులు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే బ్రెయిన్ యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

నల్ల నువ్వులు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. వీటిల్లో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. అయితే వీటిని ఎక్కువగా దేవతా కార్యక్రమాలు, పితృ దేవతలకు సంబంధించిన పనుల్లో ఉపయోగిస్తారు. కాబట్టి చాలా మంది వీటిని తీసుకోరు.

నల్ల నువ్వులు ఎంతో రుచిగా ఉంటాయి. తెల్ల నువ్వులో ఉండే పోషకాలన్నీ నల్ల నువ్వుల్లో లభ్యమవుతాయి. నల్ల నువ్వులు తీసుకుంటే క్యాన్సర్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే సమ్మర్‌లో మాత్రం తెల్ల నువ్వులు తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్ సమస్య, దురద, చికాకు వంటి సమస్యలు దూరమవుతాయి.




