- Telugu News Photo Gallery Weight loss tips Drink green tea like this to lose 7 pounds in just 1 month
Green Tea Weight Loss: గ్రీన్ టీ ఇలా తాగితే.. నెలలో 3 కిలోలకు పైగా తగ్గుతారట తెలుసా..?
ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఇందులో భాగంగా చాలా మంది చాయ్, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ అలవాటు చేసుకుంటున్నారు. అయితే సాధారణ గ్రీన్ టీ కాకుండా సరైన సమయం, గ్రీన్‌టీలో కొన్ని పదార్థాలను కలుపుకోవటం వల్ల మరింత మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నావారికి గ్రీన్ టీ ఒక్కటే సరిపోదు. దాన్ని తాగే సమయం, డైట్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ పాటిస్తే నెలలో 3-4 కిలోలు తగ్గడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jun 25, 2025 | 8:09 AM

ఉదయం నిద్ర లేచిన 30 నిమిషాల తర్వాత గ్రీన్ టీ తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మెటబాలిజం వేగంగా పనిచేయటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలంటే ముఖ్యంగా చేయాల్సిన పని గ్రీన్ టీని చక్కెర లేకుండా తాగాలి. తేనె కూడా కలుపుకోకపోవడం మంచిది.

మరొక కప్పు లంచ్‌కు 30 నిమిషాల ముందు తాగితే ఫ్యాట్ కట్ అవ్వడానికి బాగా సహాయపడుతుంది. దాంతో పాటుగా రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయండి. ఇది గ్రీన్ టీ ప్రభావాన్ని రెట్టింపు చేస్తుంది. రాత్రి తక్కువగా తినడం వల్ల గ్రీన్ టీ ప్రభావం రాత్రి సమయంలో కూడా కంటిన్యూ అవుతుంది.

మీరు తాగే గ్రీన్‌టీలో నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల కూడా మరింత మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ లోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి సమర్థవంతంగా అందేందుకు నెయ్యి వీలు కల్పిస్తుంది. నెయ్యిలో ఉండే బ్యూటైరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ మన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడేందుకు తోడ్పడుతుంది. ఈ రెండింటీ కలయికతో బరువు తగ్గే ప్రయాణం వేగవంతం అవుతుంని నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీ, నెయ్యి తరహాలోనే దాల్చిన చెక్క కూడా శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. ఇందులోని సిన్నమాల్డిహైడ్ శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుంది. దాల్చిన చెక్క మన శరీరంలో ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచి, షుగర్ స్థాయులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీ, నెయ్యి, దాల్చిన చెక్క మూడింటినీ కలిపితే... మూడింతల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించడంతోపాటు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారికి మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.




