- Telugu News Photo Gallery Viral photos new year resolutions 2022 these 4 resolutions make your life with happy and joy
Welcome 2022: కొత్త సంవత్సరంలో ఈ 4 రిజల్యూషన్స్ ట్రై చేయండి.. హ్యాపీగా ఉండండి..
2021 వెళ్లిపోయింది.. కొత్త సంవత్సరం 2022 వచ్చేసింది. ఎన్నో ఆశలు.. ఆపై చేరుకోవాల్సిన మరెన్నో గమ్యాలతో ప్రతీ ఒక్కరూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇక న్యూఇయర్‌లో అందరూ కొన్ని రిజల్యూషన్స్ పెట్టుకుంటారు. తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీటిని పాటించాలని నిర్ణయించుకుంటారు. మీ ఫ్యూచర్ పాజిటివ్‌గా ఉండేందుకు, అలాగే మీలో ఉత్సాహాన్ని నింపే కొన్ని రిజల్యూషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
Updated on: Jan 01, 2022 | 10:15 AM

వ్యాయామం: ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న వయస్సులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కడలేని రోగాలు వస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఉరుకుల పరుగుల జీవితం.. ఆపై టైంకు సరిగ్గా తినకపోవడం.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే ఆరోగ్యకరంగా ఉండాలంటే.. శారీరక శ్రమ తప్పనిసరి అని పెద్దలు అంటారు. అందుకే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఉదయాన్నే నిద్ర లేవగానే యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి చేయాలని తీర్మానం చేసుకోండి.

పోషకాహారం: ఈకాలం యువత డైట్ విషయంలో క్రమబద్దంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. బయట ఫుడ్‌ను తగ్గించాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఫుడ్‌ను డైట్‌లో చేర్చుకోండి. అప్పుడే మీరు ఆరోగ్యకరంగా ఉంటారు. లక్ష్యాలను ఈజీగా చేరుకుంటారు. దీనిని న్యూఇయర్ రిజల్యూషన్‌గా పెట్టుకోండి.

డబ్బు ఆదా: ఖర్చులను అదుపులో పెట్టుకోవడాన్ని మూడో తీర్మానంగా పెట్టుకోండి. ధనవంతులు కావాలని ప్రతీ ఒక్కరూ కలలు కంటారు. కాని దాన్ని నిజం చేయాలంటే చాలా కష్టపడాలి. అందుకే డబ్బు ఆదా చేసుకోవడం, ఖర్చులను అదుపులో పెట్టుకోవడం వంటివి మొదలుపెట్టండి. దీని కోసం, బడ్జెట్‌ను రూపొందించండి. దానికి అనుగుణంగా ఖర్చు చేయండి.

ఫైండ్ యూవర్ సెల్ఫ్(Find Yourself): ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో.. మీకంటూ కొంత సమయాన్ని వెచ్చించండి. దీనిని నాలుగో తీర్మానంగా పెట్టుకోండి. ఒత్తిడి, డిప్రెషన్‌ను దూరం చేసుకోవడమే కాకుండా.. మీకు మనశ్శాంతి దక్కాలంటే.. మీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. ఏదైనా ఇష్టమైన పనిని చేయండి. అప్పుడే మీ మనసుకు ప్రశాంతత దక్కుతుంది.
