- Telugu News Photo Gallery Viral photos A strange custom of having meals and playing games on the grave In Ayakonda village of Kurnool district
Strange Village: భయం మా ఒంట్లోనే లేదు.. సమాధుల దగ్గరే భోజనాలు.. అసలు విషయం తెలిస్తే గుండె గుభేల్..
కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలంలోని అయ్యకొండ గ్రామం. ఈ గ్రామానికి రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంది. కొండపైన ఉండే ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నాయి. తరతరాలుగా ఈగ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. అక్కడ నివసించే కుటుంబాలలో ఎవరు చనిపోయినా ఇళ్ళ ముంగిటే వారిని సమాధి చేస్తారు. దీంతో ఆగ్రామంలో ప్రతి ఇంటి ముంగిట సమాధులే దర్శనమిస్తాయి. ఆ సమాధుల మధ్యే ఊరి జనం జీవనం సాగిస్తున్నారు.
Updated on: Dec 07, 2023 | 7:13 PM

కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలంలోని అయ్యకొండ గ్రామం. ఈ గ్రామానికి రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉంది. కొండపైన ఉండే ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నాయి. తరతరాలుగా ఈగ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. అక్కడ నివసించే కుటుంబాలలో ఎవరు చనిపోయినా ఇళ్ళ ముంగిటే వారిని సమాధి చేస్తారు. దీంతో ఆగ్రామంలో ప్రతి ఇంటి ముంగిట సమాధులే దర్శనమిస్తాయి.

ఆ సమాధుల మధ్యే ఊరి జనం జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామస్తులంతా మాల దాసరి వంశానికి చెందిన వారు. చరిత్ర ప్రకారం అయ్యకొండపై అప్పట్లో చింతల మునిస్వామి తాత అనే యోగి అధ్యాత్మిక చింతనతో గడిపారని చెప్తారు. కొండ దిగువనున్న ఓ భూస్వామికి చెందిన ఆవు రోజు కొండపైకి చేరుకుని మునిస్వామి తాతకు పితకకుండానే పాలు ఇస్తుంది. ఈ విషయాన్ని భూస్వామి వద్ద ఉండే పశువుల కాపరి ఎల్లప్ప గమనించి ఆశ్ఛర్యపోయాడట.

అప్పటి నుండి చింతల మునిస్వామి వద్దే అధ్యాత్మిక సేవలో ఎలప్ప మునిగిపోయారు. ఈ క్రమంలో అతని కుమారుడికి సైతం బాల మునిస్వామిగా నామకరణం చేశారు. ఎల్లప్ప మరణించటంతో ఆయన దేహాన్ని ఇంటి ముంగిటే సమాధి చేశారు. ప్రతి శనివారం సమాధిని పేడతో అలికి, అగబత్తులు వెలిగించటం ప్రారంభించారు. ఆనాటి నుండి అయ్యకొండలో చనిపోయిన వారిని ఇంటిముందే సమాధి చేయటం అచారంగా కొనసాగుతూ వస్తోంది.

నేలపై బొంత పరుచుకునే నిద్రించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ గ్రామంలో ఏడు తరాలుగా ఈ అచారం ఆనవాయితీగా వస్తోంది. వీరి ఆచార వ్యవహారాల్లో నేటికి ఎలాంటి మార్పులేదు. అంతేకాదు ఈ కొండపై మాల దాసుల వంశస్ధులు తప్ప మరొకరు ఎవరు నివాసం ఉండేందుకు సాహసం చేయరు. ఒకవేళ ఎవరైనా కొండపై నివాసం ఉండాలని గ్రామంలోకి వచ్చినా సాయంత్రానికి కల్లా కొండదిగి వారంతట వారే వెళ్ళిపోతారని స్ధానికులు చెబుతున్నారు.

గ్రామస్తులు ప్రతినిత్యం తాము ఏమి తిన్నా, తాగినా ముందుగా చింతల మునిస్వామి తాత సమాధి వద్ద కొంత ఉంచిన తరువాతే వారు తినటం ఆనవాయితీగా వస్తుంది. మరో విచిత్రమేటంటే ఆ గ్రామంలోని ఏ ఇంట్లో కూడా మంచం కనిపించదు. మునిస్వామి తాతకు మంచం వాడొద్దని బడేసాహేబ్ శాపం పెట్టారని అందుకే అనాటి నుండి మంచాలు వాడబోమని గ్రామస్తులు చెబుతున్నారు.

గ్రామానికి చెందిన వారు ఎవరైనా పని నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్ళినా రాత్రి సమయానికి తిరిగి ఇంటికి చేరాల్సిందే. గ్రామంలోని చిన్నారులంతా తమ ఇళ్ళ ముందు ఉన్న సమాధులపైనే ఆటపాటలతో గడుపుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిపైనే కూర్చుని అన్నపానీయాలు స్వీకరిస్తుంటారు. ప్రతి అమావాస్యనాడు చింతల మునిస్వామికి గ్రామస్తులంతా కలసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమాధులకు పూజలు చేయటం ద్వారా తమ పెద్దలను దేవుళ్ళుగా కొలుస్తామని స్ధానికులు చెబుతున్నారు.
