- Telugu News Photo Gallery Viral News: meet mudskipper fish that can walk on land and survive without water
Viral News: మీకు తెలుసా.. ఈ చేపలు నడుస్తాయట.. ఫొటోలు వైరల్..
చేపలు కేవలం నీళ్లలో మాత్రమే ఉంటాయి. ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. నీళ్లను వదిలి చేపలు బయటకు వచ్చాయంటే.. చనిపోవడం ఖాయం. కానీ కొన్ని ప్రాంతాల్లో నివసించే చేపలు మాత్రం కొద్దిగా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చేపలు నీటిలోనే కాదు.. భూమిపై కూడా నివసిస్తాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర తీరాల్లో నివసించే ఓ చేపకు ఈ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సముద్రంలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కోసారి ఎక్కువగా..
Updated on: Aug 18, 2024 | 1:16 PM

చేపలు కేవలం నీళ్లలో మాత్రమే ఉంటాయి. ఈ విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. నీళ్లను వదిలి చేపలు బయటకు వచ్చాయంటే.. చనిపోవడం ఖాయం. కానీ కొన్ని ప్రాంతాల్లో నివసించే చేపలు మాత్రం కొద్దిగా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ చేపలు నీటిలోనే కాదు.. భూమిపై కూడా నివసిస్తాయి.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని సముద్ర తీరాల్లో నివసించే ఓ చేపకు ఈ లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సముద్రంలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కోసారి ఎక్కువగా.. కొన్ని సార్లు తక్కువగా ఉంటాయి.

ఇలాంటి ప్రదేశాల్లో చేపలు అనేవి జీవించలేవు. కానీ ఓ చేప జాతికి చెందిన ఈ చేపలు మాత్రం జీవిస్తాయి. అంతేకాదు భూమిపై నడుస్తాయి.. జంపింగ్ కూడా చేస్తాయి. ఇవి నీరు లేనప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లగలవు. చిన్న పాటి చెట్లను కూడా ఎక్కుతాయట.

ఇవి ఎక్కువగా మడ అడవులు ఉన్నచోట నివసిస్తాయని మత్స్య కారులు చెబుతున్నారు. వీటిని 'మోప్పడాయ చేపలు' అని పిలుస్తారట. ఈ చేపలు గోజయిడే కుటుంబానికి చెందినవి. ఈ మోప్పడాయ చేపలు చర్మం, నోటి లోపలి భాగం ద్వారా ఊపిరి తీసుకుంటాయి.

ఈ ప్రక్రియ వల్ల ఈ చేపలు నీటిలోనే కాకుండా బయట కూడా చాల సేపు బతకడానికి వీలు ఉంటుంది. ఈ చేపలకు ముందు బలమైన రెక్కలు ఉంటాయి. ఇవి బురద మీద జంప్ చేస్తాయి. కాబట్టి వీటిని మడ్ స్కిప్పర్స్ చేపలు అని కూడా పిలుస్తారు.





























