- Telugu News Photo Gallery Vastu Tips: These are the four plants that bring negative energy into the house
ఇంట్లో ఈ నాలుగు మొక్కలు ఉంటే దరిద్రమే.. వెంటనే తీసేయ్యండి!
ఇంట్లో అందమైన మొక్కలు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరు తమకు నచ్చిన మొక్కలను తీసుకొచ్చుకొని, ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. అయితే ఇంట్లో మొక్కలు పెంచుకునే సమయంలో తప్పకుండా వాస్తు టిప్స్ పాటించాలంట. మరీ ముఖ్యంగా కొన్ని మొక్కలను ఇంటిలో అస్సలే నాట కూడదంట. దీని వలన అనేక సమస్యలు చుట్టుముడుతాయంట. కాగా, ఇంట్లో ఉండకూడని మొక్కలు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 15, 2025 | 12:05 PM

వాస్తు నిపుణులు, ఇంట్లో మొక్కలను పెంచుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే? కొన్ని మొక్కలు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తే మరికొన్ని మొక్కలు మాత్రం కష్టాలు , నష్టాలు తీసుకొస్తాయంట.కాగా, ఇంటిలో ప్రతి కూల శక్తిని పెంచి, సమస్యలను తీసుకొచ్చే మొక్కలు ఏవి అంటే?

బ్రహ్మజెముడు మొక్క : ఈ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన ఇంటికే అందం వస్తుంది. కానీ ఈ మొక్కను అస్సలే ఇంటిలో పెంచుకోకూడదంట. దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన దీని పదునైన ముళ్లు ఇంట్లో సంఘర్షణ వాతావరణం, అలాగే గొడవలకు కారణం అవుతుందంట. అందుకే వీటిని వీలైనంత వరకు బాల్కనీల వద్ద లేదా పెరట్లో మాత్రమే నాటుకోవాలంట.

స్నేక్ ప్లాట్ : ఈ మొక్క చాలా మంది తమ ఇంటిలో పెట్టుకుంటారు. దీని వలన ఇంటికి అందమే కాకుండా ఇది గాలిని శుద్ధి చేస్తుందని ప్రతి ఒక్కరు తమ ఇంటిలోపల ఈ మొక్కను పెంచుకుంటారు. అయితే ఈ మొక్కను ఇంటిలోపల కాకుండా ద్వారం వద్ద లేదా బాల్కనీలో పెట్టుకోవాలంట. దీని వలన సానుకూల శక్తి ఇంటిలో ప్రవేశిస్తుందంట.

లక్కీ వెదురు : చాలా మంది తమ ఇంటిలోపల లేదా కార్యాలయల్లో పెట్టుకునే మొక్కల్లో లక్కీ వెదురు ఒకటి. ఈ వెదురు కాకుండా సాంప్రదాయ, నిజమైన వెదురు మొక్కలను ఇంటిలోపల పెంచుకోకూడదంట. దీని వలన ఇంట్లో అశాంతి నెలకొంటుందని చెబుతున్నారు పండితులు.

తీగ దొండ : ఐవీ మొక్క. దీనిని తీగ దొండ అని కూడా అంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతాయంట. దీని వలన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందంట. అందుకేవీలైనంత వరకు ఈ మొక్కను ఇంటిలోప పెట్టుకోకూడదంట.



