AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఇంట్లో వెదురు మొక్క పెడితే ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసా?

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు నియమాలు సరిగ్గా పాటించినట్లైతే, ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు పండితులు. ఇక చాలా మంది ఇంటిలో పాజిటివ్ వైబ్ కోసం కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటారు. అయితే మనం ఇప్పుడు వాస్తు ప్రకారం ఇంటిలోప వెదురు మొక్క పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 14, 2025 | 5:48 PM

Share
కొన్ని  మొక్కలను ఇంటిలో పెట్టుకోవడం వలన అవి అదృష్టంతో పాటు శ్రేయస్సును తీసుకొస్తాయని చెబుతుంటారు. అంలాంటి మొక్కల్లో వెదురు మొక్క ఒకటి. ఈ మొక్కను చాలా మంది తమ ఇంటిలోపల పెట్టుకుంటారు. దీని వలన ఇంటి అందం రావడమే కాకుండా ఆర్థికంగా కలిసివస్తుందని వారి నమ్మకం. కాగా దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

1 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వెదురు మొక్క పెంచుకోవడం చాలా మంచిదంట. ఈ మొక్కలో లక్ష్మీ దేవి నివసిస్తుందని చెబుతుంటారు పండితులు. అందువలన వెదురు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ఆ ఇంటిలో సిరిసంపదలకు లోటు ఉండదంట. ఆర్థికంగా ఆరోగ్యం పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయంట.

2 / 5
అదే విధంగా మంచి ఫలితాలు రావాలంటే వెదురు మొక్కను మీ ఇల్లు లేదా కార్యాలయంలోని ఆగ్నేయంలో పెట్టుకోవడం చాలా మంచిదంట. దీని వలన సంపద పెరగడమే కాకుండా ఆర్థిక వృద్ధి కలుగుతుందంట. అలాగే  వెదురు మొక్కను  తూర్పు  దిశలో పెట్టడం వలన కూడా ప్రయోజనకరంగా ఉంటుందంట. ఎందుకంటే  తూర్పు దిశ అనేది కుటుంబ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అంతే కాకంుడా ఇది సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో వెదురు మొక్క పెట్టడం వలన మంచి జరుగుతుందంట.

3 / 5
అయితే వెదురు మొక్కను ఇంటిలో ఎక్కడ పెట్టినా సానుకూల ఫలితాలే కలుగుతాయంట. కానీ ఇంటిలోని కొన్ని ప్రదేశాలలో మాత్రం దీనిని అస్సలు పెట్టకూడదంట. ఇళ్లు, కార్యాలయాలకు వెదురు గొప్పది అయినప్పటికీ, సాధారణంగా దీనిని బెడ్‌రూమ్‌లో ఉంచకూడదని చెబుతున్నారు పండితులు. దీని సాధ్యమైనంత వరకు లివింగ్ రూమ్, స్టడీ, ప్రవేశ ప్రాంతం లేదా వర్క్‌స్టేషన్‌లలో పెట్టుకోవాలంట. దీని వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందంట.

4 / 5
ఇక వెదురు మొక్కలో గాలిని శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన దీనిని ఇంటిలో పెట్టుకోవడం వలన ఇది గాలిలోని చెడు విషాన్ని తీసుకొని, ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అంతే కాకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంట.

5 / 5