Egg Shells: గుడ్డు పెంకులతో ఒంటి నొప్పులు చిటికెలో మాయం చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
మనలో చాలా మంది గుడ్లను ఉడకబెట్టి, గుడ్డు పెంకులను పారేస్తుంటాం. కొంత మంది మొక్కలకు ఎరువుగా గుడ్డు పెంకులను ఉపయోగిస్తారు. కానీ ఎరువులు తయారు చేయడమే కాకుండా గుడ్డు పెంకులను అనేక ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి గుడ్డు పెంకులను ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: May 28, 2025 | 5:53 PM

సాధారణంగా గుడ్లను ఉడకబెట్టి, గుడ్డు పెంకులను పారేస్తుంటాం. కొంత మంది మొక్కలకు ఎరువుగా గుడ్డు పెంకులను ఉపయోగిస్తారు. కానీ ఎరువులు తయారు చేయడమే కాకుండా గుడ్డు పెంకులను అనేక ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. కాబట్టి గుడ్డు పెంకులను ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం..

వంట గదిలో పాత్రల మరకలను తొలగించడంలో గుడ్డు పెంకులు చాలా సహాయపడతాయి. గుడ్డు పెంకులు ముఖ్యంగా పాన్‌ల నుంచి మాడిన మరకలను తొలగించడానికి ఉపయోగపడతాయి.

కీటకాల నుండి రక్షించడానికి గుడ్డు పెంకులను ఉపయోగించవచ్చు. కీటకాలు, బొద్దింకలు, బల్లులు ఒక్క క్షణంలో ఇంట్లో నుండి మాయమైపోవాలంటు గుడ్డు పెంకులను పొడి చేసి ఇంట్లో ఒక మూలలో ఉంచాలి. ఇలా చేస్తే కీటకాలు దూరంగా ఉంటాయి.

గుడ్డు పెంకులతో శరీర నొప్పులను కూడా చిటికెలో నయం చేయవచ్చు. అందుకు గడ్డుపెంకులతోపాటు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా కావాలి. ఎలా అప్లై చేయాలంటే..

ఒక గిన్నెలో ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని దానితో గుడ్డు పెంకు పొడి కలుపుకోవాలి. ఇప్పుడు దానిని నొప్పి ఉన్న ప్రాంతానికి అప్లై చేయాలి. ఇలా చేస్తే నొప్పి త్వరగా తగ్గడం మీరు గమస్తారు.




