బిస్కెట్స్ ఎక్కువ తింటున్నారా? ఇది తెలిస్తే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఓపెన్ చేయరు!
బిస్కెట్స్ తినడానికి ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా బిస్కెట్స్ తింటుంటారు. ఇక టీ, బిస్కెట్స్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది టీతో పాటు బిస్కెట్స్‌ను చాలా ఇష్టంగా తింటుంటారు. ఇవి చాలా స్వీట్‌గా ఉండటమే కాకుండా, కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.అయితే మీరేప్పుడైనా ఆలోచించారా? బిస్కెట్స్ ఆరోగ్యానికి మంచివేనా అని? అయితే ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.
Updated on: Jul 27, 2025 | 4:59 PM

పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ తినే బిస్కెట్స్ అతిగా తినడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.ఇవి శరీరానికి చాలా హానిచేస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే బిస్కెట్స్‌లో తీపి, దీనిని రెడీ చేయడానికి ఉపయోగించే పిండి, చక్కెర, హైడ్రోజనేటెడ్ నూనె ఇవన్నీ జీర్ణక్రియ సమస్యలను తీసుకొస్తాయంట. కాగా, బిస్కెట్స్ తినడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది ఎంతో ఇష్టంగా బిస్కెట్స్ తింటారు. అయితే బిస్కెట్స్ ఎక్కువగా తినడం వలన ఇందులో ఉన్న కెలరీస్, చక్కెర శరీరంలో కొవ్వు పెరుగుదలకు కారణం అవుతుందంట. దీని వలన త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక డయాబెటీస్ ఉన్న వారు అస్సలే బిస్కెట్స్ తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? ఇందులో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందంట. దీని వలన ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుందని, అందుకే డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్న వారు బిస్కెట్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా చాలా వరకు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎక్కువగా బిస్కెట్స్ ఇస్తుంటారు. కానీ ఇది ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అని హెచ్చరికస్తున్నారు వైద్య నిపుణులు. పిల్లలు బిస్కెట్స్ ఎక్కువగా తినడం వలన ప్రోటీన్, ఫైబర్, వంటివి తక్కువగా ఉంటాయంట. అందువలన పిల్లలకు ఎక్కువ బిస్కెట్స్ ఇవ్వడం వలన ఇవి వీరిలో పెరుగుదలను నియంత్రించడమే కాకుండా , రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తాయంట.