- Telugu News Photo Gallery Technology photos Xiaomi Launches New Smartphone Xiaomi 11 Lite 5G Phone Have A Look On Features And Price Details
Xiaomi 11 Lite: భారత మార్కెట్లోకి షావోమి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. 64 మెగా పిక్సెల్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.
Xiaomi 11 Lite: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమి తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. షావోమీ 11 లైట్ ఎన్‌ఈ 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను జోడించింది. 64 మెగా పిక్సెల్స్ కెమెరాతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 29, 2021 | 1:56 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం షావోమి తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. షావోమీ 11 లైట్ ఎన్‌ఈ 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బుధవారం విడుదల చేశారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.55 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే స్క్రీన్‌ను అందించారు. 158 గ్రాముల బరువుతో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ 6.81 మి.మిల మందంతో రూపొందించారు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు.

కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కెమెరా కోసం 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఈ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌తో కూడిన 4,250ఎమ్ ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ధర విషయానికొస్తే ఈ ఫోన్ 6జీబీ+128 స్టోరేజ్ జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 26,999, 8జీబీ+128జీబీ స్టోరేజ్ ఫోన్ రూ. 28,999కి అందుబాటులో ఉంది. షావోమి ప్రారంభ ధరలో భాగంగా రూ. 2000తో పాటు దీపావళి డిస్కౌంట్‌లో భాగంగా రూ. 1500 అందించనున్నారు.




