- Telugu News Photo Gallery Technology photos Do You Want To Download Twitter Videos Follow These Simple Tricks
Twitter Videos: ట్విట్టర్ వీడియోలను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియట్లేదా.. ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి..
Twitter Videos: చాలా రకాల వీడియోలు ఇటీవల ట్విట్టర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి. అయితే వీటిని డౌన్‌లోడ్ చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. థర్డ్ పార్టీ యాప్‌లు ఉపయోగించాల్సి ఉంటుంది. అలాకాకుండా కొన్ని..
Updated on: Sep 29, 2021 | 7:17 AM

ఇటీవలి ట్విట్టర్ వేదికగా చాలా మంది ఆసక్తికరమైన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిని చూసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోవడం సాధ్యం కాదు.

అయితే చాలా వరకు థర్డ్ పార్టీ యాప్‌లు, వెబ్‌సైట్, పలు టూల్స్ అందుబాటులో ఉన్నా వీటివల్ల కంప్యూటర్‌కు హాని జరిగే ప్రమాదం ఉంది. మరి సేఫ్‌గా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా?

వీటిలో మొదటి ఆప్షన్ https://ssstwitter.com/en వెబ్‌సైట్. ముందుగా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి, మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియో సంబంధిత ట్వీట్ లింక్‌ను ఎంటర్ చేసి డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

ఇక క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించే వారు.. ఉచితంగా అందుబాటులో ఉండే ఎస్‌ఎస్‌ఎస్‌ట్విటర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎక్స్‌టెన్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, బ్రౌజర్‌కు యాడ్ చేసుకుంటే చాలు. ఆ తర్వాత ట్విటర్ పేజీని ఎప్పుడు ఓపెన్ చేసినా వీడియోలు, జిఫ్‌ల కింద డౌన్‌లోడ్ బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే నేరుగా వీడియోలు డౌన్‌లోడ్ అవుతాయి.

అంతేకాకుండా అడ్రస్ బార్‌లో మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియో సంబంధిత ట్వీట్ అడ్రస్‌బార్‌లో https:// తర్వాత sss టైప్ చేసి ఎంటర్ చేయాలి. వీడియో సులభంగా డౌన్‌లోడ్ అవుతుంది.




