- Telugu News Photo Gallery Technology photos Whatsapp introduces new feature check here for chat lock feature details
WhatsApp: వాట్సాప్‌లో సీక్రెట్ చాటింగ్.. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది
వాట్సాప్ ఉండని స్మార్ట్ ఫోన్ ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకురాడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. తాజాగా ఇలాంటి ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు..
Updated on: Nov 19, 2024 | 1:32 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా క్లోజ్ ఫ్రెండ్స్‌తో పర్సనల్ చాటింగ్ చేస్తుంటాం. అయితే ఈ చాట్ ఇతరులకు కనిపించకుండా చూసుకుంటుంటారు.

ఇలాంటి వారి కోసమే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. చాట్ లాక్ ఫీచర్ పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేవారు. వ్యక్తిగత చాటను ఇందులో భద్రంగా దాచుకోవచ్చన్నమాట.

మీ వ్యక్తిగత చాట్‌లను సీక్రెట్ కోడ్‌ను క్రియేట్ చేసుకొని మీ ప్రైవేట్ చాట్ ని రహస్యంగా దాచుకునే అవకాశం కల్పించారు. అయితే ఇలా లాక్ చేసిన చాట్‌లను లాక్డ్ చాట్స్ సెక్షన్‌లో చూసుకోవచ్చు.

ఈ లాక్డ్ చాట్స్ సెక్షన్‌ను ఇతరులు ఓపెన్ చేసేందుకు వీలు లేకుండా సీక్రెట్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు. దీంతో మీ చాట్‌లు భద్రంగా ఉంటాయి. అలాగే ఇది యాప్‌లో కనిపించకుండా చూసుకోవచ్చు.

ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ మెసేజ్‌లను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. దీంతో ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ సీక్రెట్ చాటింగ్స్ ఓపెన్ చేయాలంటే సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే చాటింగ్ కనిపిస్తుంది.




