- Telugu News Photo Gallery Technology photos WhatsApp can fill up your phone storage turn off this setting tech tips and tricks
WhatsApp: వాట్సాప్ వల్ల మీ ఫోన్ స్టోరేజీ నిండిపోతుందా? ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేయండి!
WhatsApp: ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతుంటారు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుబోయే వరకు ఎంతో మంది వాట్సాప్‌లో మునిగిపోతుంటారు. అయితే వాట్సాప్‌లో కొన్ని ఫోటోలు, వీడియోలు అటోమెటిగ్ డౌన్‌లోడ్ అవుతాయి. దీని వల్ల ఫోన్ స్టోరేజీ నిండిపోతుంటుంది. ఫోన్‌లో ఈ ఒక్క సెట్టింగ్ ఆప్ చేస్తే చాలా స్టోరేజీ నిండకుండా ఉంటుంది..
Updated on: Sep 19, 2025 | 11:23 AM

WhatsApp: వాట్సాప్ చాలా ఫీచర్లను అందిస్తుంది. కానీ చాలా మందికి వాటన్నింటి గురించి తెలియదు. వాట్సాప్ సంస్థ రోజురోజుకు కొత్త ఫీచర్స్‌ను పరిచచయం చేస్తోంది.

తరచుగా వాట్సాప్‌కు పంపే ఫోటోలు, వీడియోలు, రికార్డింగ్‌ల సంఖ్య ఫోన్ స్టోరేజీని నింపేంత వరకు పెరుగుతుంది. ప్రతి సారి వాట్సాప్‌లోని ఫోటోలు, వీడియోలు డౌన్ లోడ్ కావడం వల్ల మీ స్టోరేజీ పెరిగిపోతుంటుంది.

మీడియా విజిబిలిటీ ఈ ఫీచర్ వాట్సాప్ సెట్టింగ్‌లలో అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫీచర్ మీ ఫోన్ స్టోరేజీని నింపగలదు. దీంతో స్టోరేజీ పెరిగిపోవడం వల్ల ఇబ్బందిగా ఉండవచ్చు.

మీడియా విజిబిలిటీ ఫీచర్ ఆన్ చేసి ఉంటే మీరు WhatsAppలో అందుకునే ఏవైనా ఫోటోలు, వీడియోలు స్వయంచాలకంగా డౌన్‌లోడ్ అవుతుంటాయి. మీరు స్టోరేజీని ఆదా చేయాలనుకుంటే మీరు వెంటనే ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి.

ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయడానికి వాట్సాప్ సెట్టింగ్‌లలో చాట్స్ ఆప్షన్‌కి వెళ్లండి. ఇక్కడ, మీరు మీడియా విజిబిలిటీ ఫీచర్‌ను ఆఫ్ చేసే ఆప్షన్‌ను కనుగొంటారు. మీరు వ్యక్తిగత చాట్‌లకు కూడా ఈ ఫీచర్‌ను సులభంగా ఆఫ్ చేయవచ్చు.




