- Telugu News Photo Gallery Technology photos These are the best smart phones under 20k, check here for full details
Smartphone: రూ. 20 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్ ఇవే..
మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తోంది. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. దీంతో ఏడాదికి మించి ఫోన్ వాడడమే కష్టంగా మారిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రతీసారి కొత్త ఫోన్ కొనుగోలు చేయాలంటే బడ్జెట్‌తో కూడిన అంశంగా చెప్పొచ్చు. మరి బడ్జెట్ ధరలో కొత్త ఫోన్ కోసం చూస్తున్న కొన్ని వారికి కొన్ని బెస్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ ఫోన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jul 07, 2024 | 8:26 PM

Lava Agni 2 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్‌లో లావా అగ్ని 2 ఒకటి. ఈ ఫోన్ అసలు ధర రూ. 25,999కాగా అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో రూ. 16,999కే లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో 66 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. 6.78 ఇంచెస్‌తో కూడని ఫుల్‌హెచ్‌డీ+ కర్వ్డ్ అమోఎల్‌ఈడీ డిసప్లేను ఇచ్చారు.

OnePlus Nord CE 3 Lite 5G: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 19,999కాగా అమెజాన్‌లో 12 శాతం డిస్కౌంట్‌తో రూ. 17,699కే లభిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందింఆచరు 6.72 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు.

realme 12 5G: రూ. 20 వేలలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మీ 12 5జీ ఒకటి. ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించారు. 45 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. ధర విషయానికొస్తే అసలు ధర రూ. 20,999 కాగా 24 శాతం డిస్కౌంట్‌తో రూ. 16,030కి సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy F34 5G: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 25,999కాగా 37 శాతం డిస్కౌంట్‌తో రూ. 16,443కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపికెల్స్‌తో కూడిన నో షేక్ కెమెరాను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఇచ్చిన ఫోన్‌లో డాల్బీ ఆటమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక అమోఎల్‌ఈడీ స్క్రీన్‌తో పాటు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు.

Samsung Galaxy M32: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎమ్32 స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 18,999కాగా 25 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 14,300కి లభిస్తోంది. ఈ ఫోన్‌లో 6.4 ఇంచెస్‌తో కూడిన సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను, సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 20 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందంచారు. 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.




