- Telugu News Photo Gallery Technology photos These are the best hidden camera detector device check here for full details
Hidden Camera: సీక్రెట్ కెమెరాలను గుర్తించే డివైజ్‌లు.. ఇవి మీతో ఉంటే..
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల ఇష్యూ తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీక్రెట్ కెమెరాలకు సంబంధించి ప్రస్తుతం అందరిలో ఆందోళన మొదలైంది. మరి మనకు తెలియకుండా ఏర్పాటు చేసే కెమెరాలను గుర్తించేందుకు కొన్ని డివైజ్‌లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 02, 2024 | 9:28 PM

Hidden Spy Camera Detector: ఈ డివైజ్‌ను ఒక చిన్న సైజ్ థర్మామీటర్ సైజ్‌లో డిజైన్ చేశారు. దీని ధర రూ. 6955కి అందుబాటులో ఉంది. వైర్‌లెస్ సిగ్నల్ స్కానర్ ఆధారంగా ఇదవి కెమెరాలను గుర్తిస్తుంది. లిథియం ఐయాన్ బ్యాటరీతో తీసుకొచ్చారు.

METRICSQUARE Hidden Camera Detector: ఈ హిడెన్ కెమెరా డిటెక్టర్ ధర అమెజాన్‌లో రూ. 3999కి లభిస్తోంది. ఈ డివైజ్ సహాయంతో జీపీఎస్ లోకేటర్స్, కెమెరాలను గుర్తించవచ్చు. చేతిలో ఇమిడిపోయే ఈ డివైజ్‌లో ఉండే ఇన్‌ఫ్రారెడ్ లైట్ సహాయంతో కెమెరాలను కనిపెట్టవచ్చు.

Muayb Hidden Camera Detector: ఈ డివైజ్ ధర రూ. 3079గా ఉంది. ఈ డివైజ్ సహాయంతో హిడెన్ కెమెరాలతోపాటు, హిడెన్ జీపీఎస్, బగ్‌లను కూడా గుర్తించవచ్చు. ఇందులోని యాంటినా ద్వారా కెమెరాలను గుర్తించవ్చు.

Skypearll Hidden Camera Detector: హిడెన్ కెమెరాలను గుర్తించడానికి ఇది కూడా బెస్ట్ డివైజ్‌గా చెప్పొచ్చు. దీని ధర రూ. 1199గా ఉంది. ఈ డివైజ్‌లో రెడ్ లైట్ ద్వారా అనుమానిత ప్రదేశాలపై ఫోకస్ చేసి కెమెరాలాగా ఉండే షేప్ నుంచి గమనిస్తే చాలు. ఏవైనా కెమెరాలు ఉంటే కనిపిస్తాయి. ఇందులో 260 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ కూడిన రీఛార్జబుల్ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 20 గంటలు పనిచేస్తుంది.

Skypearll Hidden Camera Detector Pen: చిన్నగా పెన్ను రూపంలో ఉన్న ఈ హిడెన్ కెమెరా డిటెక్టర్ ధర రూ. 4599కి అమెజాన్‌లో అందుబాటులో ఉంది. వీటి ద్వారా హోటల్ రూమ్స్‌లో, ట్రయల్ రూమ్‌లో ఏర్పాటు చేసే హిడెన్ కెమెరాలను గుర్తించవచ్చు. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 25 గంటలు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది. ఇందులో నుంచి వచ్చే లైట్‌ను రూమ్‌లో ఫోకస్ చేయడం ద్వారా హిడెన్ కెమెరాలను గుర్తించవచ్చు.




