నథింగ్ ఫోన్(2ఏ)(Nothing Phone(2a)).. ఈ ఫోన్ మూడు రకాల వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో రూ.23,999, అలాగే 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో రూ.25,999, ఇక 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో రూ.27,999కు లభిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ గల 6.7 ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ ప్లే తో ఆకట్టుకుంటుంది. మంచి రిజల్యూషన్, 30-120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 10 బిట్ కలర్ డెప్త్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ ఉన్నాయి. ఇక 50 ఎంపీ+50 ఎంపీ కెమెరా సెటప్, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఆకట్టుకుంటుంది.