- Telugu News Photo Gallery Technology photos Tecno launches new foldable smartphone Tecno Phantom V Fold 2 5G and Tecno Phantom V Flip 2 features and price details
Tecno Phantom V: టెక్నో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్ ఫోన్.. ధరకు తగ్గట్లే, సూపర్ ఫీచర్స్.
ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ హవా నడుస్తోంది. దాదాపు అన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు మార్కెట్లోకి మడత పెట్టే ఫోన్ లను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మార్కెట్లోకి మరో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ, ఫాంటం వీ ఫ్లిప్ 2 ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇంతకీ ఈ ఫోన్స్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి, ధర ఎంత ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...
Updated on: Sep 15, 2024 | 7:42 PM

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో.. భారత మార్కెట్లోకి కొత్త ఫోల్డబుల్ ఫోన్ ను తీసుకొచ్చింది. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ, ఫాంటం వీ ఫ్లిప్ 2 పేర్లతో ఈ ఫోన్ ను లాంచ్ చేశారు.

ఈ రెండు ఫోన్ లలో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ప్రాసెసర్ ను అందించారు. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 6.42 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2550 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ , 7.85 అంగుళాల 2కే + (2000×2296 పిక్సెల్స్) అమోలెడ్ స్క్రీన్ డిస్ ప్లేను ఇందులో అందించారు.

కనెక్టివిటీ విషయానికొస్తే.. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3 వంటి ఫీచర్లను అందించారు. యాక్సెలరో మీటర్, గైరోస్కోప్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, హాల్ సెన్సర్, ఈ-కంపాస్, ఫ్లిక్కర్ సెన్సర్ ఫీచర్స్ అందించారు.

టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ ఫోన్ 6.9 ఇంచెస్ తో కూడిన ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్ ను ఇచ్చారు. ఔట్ సైడ్ లో 3.64 ఇంచెస్ తో కూడిన అమోలెడ్ స్క్రీన్ ను ఇచ్చారు. టెక్నో ఫాంటం వీ ఫోల్డ్ 2 5జీ ఫోన్ ధర రూ.92,200.. టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 2 5జీ ఫోన్ రూ.58,600గా నిర్ణయించారు.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, అన్ ఫోల్డ్ చేసినప్పుడు 32-మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటోఫోకస్ అందించారు. ఈ నెల 23 నుంచి ఆఫ్రికాలో సేల్స్ ప్రారంభం అవుతాయి.




