- Telugu News Photo Gallery Technology photos Youtube developing new AI feature that can detect AI deleted videos
Youtube: యూట్యూబ్ లో కొత్త ఏఐ టూల్… డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేలా
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌తో యూజర్లను అట్రాక్ట్ చేసేందుకు సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేసే ఫీచర్‌ను తీసుకొచ్చింది..
Updated on: Sep 15, 2024 | 7:29 PM

ప్రస్తుతం డీప్ ఫేక్ వీడియోలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. కొందరు కేటుగాళ్లు మోసపూరితంగా వీడియోలను రూపొందిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే ఇలాంటి వీడియోలకు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది.

డీప్ ఫేక్ వీడియోలను అరికట్టేందుకు కొత్త AI టూల్ ఫీచర్‌ను యూట్యూబ్ త్వరలోనే తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. యూట్యూబ్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో డీప్‌ఫేక్ ఫేస్‌తో పాటు వాయిస్‌ను కూడా సులభంగా గుర్తించవచ్చు. దీంతో డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవ్వడం ఆగిపోతుందని యూట్యూబ్ చెబుతోంది.

ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫేస్-డిటెక్షన్ టూల్‌పై కంపెనీ పనిచేస్తోందని YouTube తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో తెలియజేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వారి వీడియోల్లో ఉన్న వారి ముఖం అసలైందేనా.? ఎడిట్ చేసిందా తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ రూపొందించే దశలో ఉన్నారు. 2025 మొదటి నుంచి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డెవలప్‌మెంట్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.

ఇక యూట్యూబ్ త్వరలోనే సింథటిక్-సింగింగ్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని కూడా పరిచయం చేయబోతోంది, దీని సహాయంతో వినియోగదారులు AI- రూపొందించిన వాయిస్‌ను కూడా సులభంగా గుర్తించవచ్చు. అంటే ఇకపై ఇతరుల గొంతుతో చేసే వీడియోలను సైతం యూట్యూబ్ గుర్తిస్తుంది.




