- Telugu News Photo Gallery Technology photos Samsung premium foldable smartphone Samsung Galaxy Z Fold 6 price RS 2 lakhs
Samsung Galaxy Z Fold6: ఈ ఫోన్ ధరతో, ఎంచక్కా సెకండ్ హ్యాండ్ కారే కొనొచ్చు. ప్రైజ్ ఎంతో తెలిస్తే..
ఓవైపు బడ్జెట్ ఫోన్‌లతో పాటు, మరోవైపు ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లకు సైతం మార్కెట్లో డిమాండ్ ఉంటోంది. ఒకప్పుడు రూ. 50 ఫోన్ అంటేనే వామ్మో అనుకునే వాళ్లం, కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ధరలు లక్షలు దాటేసింది. తాజాగా సామ్‌సంగ్ నుంచి వచ్చిన కొత్త ఫోన్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవాల్సిందే..
Updated on: Aug 11, 2024 | 7:40 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల మార్కెట్లోకి గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్6 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. అయితే ఈ ఫోన్ ధరతో ఎంచక్కా ఒక సెకండ్ హ్యాండ్ కారునే కొనుగోలు చేయొచ్చు.

సామ్‌సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్6 స్మార్ట్‌ఫోన్.. 12జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ అక్షరాల రూ. 2,00,999కావడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోన్‌ను పలు బ్యాంకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 15 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

ఇంతకీ రూ. 2 లక్షల ధర పలికే ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయనేగా మీ సందేహం. వివరాల్లో వెళితే.. ఇది ఒక మడతపెట్టే ఫోన్. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 వంటి పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 2 లిథియం బ్యాటరీలను అందించారు.

స్క్రీన్ విషయానికొస్తే ఈ ఫోన్‌లో ఫోల్డబుల్ డైనమిక్ ఎల్‌టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 7.6 ఇంచెస్‌తో స్క్రీన్ ఈ ఫోన్ సొంతం. అలాగే 6.3 ఇంచెస్‌తో కూడిన కవర్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్, 10 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా చూస్తే సౌడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు.




