- Telugu News Photo Gallery Technology photos Reliance Jio users can enjoy JioHotstar for three months FREE
JioHotstar: వినియోగదారులకు 3 నెలల పాటు జియో హాట్‌స్టార్‌ను ఉచితంగా.. ఎలాగో తెలుసా?
JioHotstar: OTT ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలకు వినోదానికి ప్రధాన మార్గంగా మారాయి. గత సంవత్సరం డిస్నీ, రిలయన్స్, వయాకామ్ 18 విలీనాన్ని పూర్తి చేసిన తర్వాత జియో హాట్‌స్టార్ యాప్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందనే చర్చ జరిగింది. ఇప్పుడు వేచి ఉండటం ముగిసింది. ఎందుకంటే..
Updated on: Feb 19, 2025 | 9:55 AM

టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల కొత్త స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ సింగిల్ ప్లాట్‌ఫామ్‌ను జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ రెండింటినీ కలిపేసింది. రెండింటి కంటెంట్‌ను ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. మీరు దాని సభ్యత్వాన్ని పూర్తిగా ఉచితంగా కావాలంటే జియో ప్లాన్ ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది.

రిలయన్స్ జియో 84 రోజుల చెల్లుబాటుతో అపరిమిత 5G డేటా లభించే ప్లాన్‌ను అందిస్తోంది. దీనితో పాటు అపరిమిత కాలింగ్ ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. ప్రతిరోజూ SMS కూడా పంపవచ్చు. మీరు కొత్త OTT సేవను ఆస్వాదించాలనుకుంటే, దాని కోసం విడిగా ఖర్చు చేయడానికి బదులుగా, మీరు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ కంటెంట్‌ను చూడవచ్చు.

ఉచిత JioHotstar తో ఉన్న ఏకైక Jio ప్లాన్: జియో సబ్‌స్క్రైబర్‌లకు అందించే పెద్ద రీఛార్జ్ ప్లాన్‌లలో రీఛార్జ్‌పై జియోహాట్‌స్టార్‌కు యాక్సెస్ ఇచ్చే ఏకైక ప్లాన్ ఇదే. ఈ ప్లాన్ ధర రూ. 949. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు ప్రతిరోజూ 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. వినియోగదారులు రోజుకు 100 SMSలను కూడా పంపవచ్చు.

ఈ ప్లాన్‌ను ఎంచుకుంటే జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పూర్తి మూడు నెలల పాటు అందించనుంది. దీనితో పాటు జియో టీవీ, జియోక్లౌడ్ వంటి యాప్‌లకు యాక్సెస్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లకు రిలయన్స్ జియో అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది.

ఇక నుంచి జియో సినిమా అనేది ప్రత్యేకంగా ఉండదు. డిస్నీ+ హాట్‌స్టార్, జియో హాట్‌స్టార్ రెండు కలిసిపోవడంతో జియో సినిమా కూడా అందులోనే రానుంది. మీరు జియో సినిమా యాప్‌ను ఓపెన్ చేసినా నేరుగా జియో హార్ట్‌స్టార్‌కు వెళ్తారు. అక్కడి నుంచే కంటెంట్‌ను చూడవచ్చు.




