- Telugu News Photo Gallery Technology photos Oneplus launching new smart phone Oneplus 11r 5g features and price details Telugu Tech News
OnePlus 11R 5G: వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. మొదలైన ప్రీ ఆర్డర్ బుకింగ్‌లు. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ప్రీ-ఆర్డర్ బుకింగ్‌లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 28 నుంచి సేల్స్ ప్రారంభంకానున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Feb 22, 2023 | 10:30 AM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 11 ఆర్ పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 28 నుంచి జరగనున్నాయి. ప్రీ-ఆర్డర్ బుకింగ్స్ బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి.

ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రెండు వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999 కాగా 16 జీబీ ర్యామ్, 253 జీబీ స్టోరేజ్ ధర రూ. 44,999గా ఉంది. ఐసీసీఐ కార్డుల ద్వారా బుక్ చేసుకున్న వారికి రూ. 1000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీ ఆర్డర్ బుక్ చేసుకున్న వారికి రూ. 5999 విలువ చేసే వన్‌ప్లస్ బడ్జ్‌జెడ్2 ఉచితంగా అందిస్తారు.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 360Hz టచ్ రెస్పాన్స్ రేట్, HDR10+ కంపాటబిలిటీతో కూడిన 6.74 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 SoC ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది.

బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. గేలస్టిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు.

ఇక కెమెరాకు పెద్ద పీట వేసిన ఈ ఫోన్‌లో ట్రిపుల్ సెటప్ కెమెరాను అందించారు. OIS సపోర్ట్‌తో కూడిన IMX890 సెన్సర్ కలిగిన 50ఎంపీ సోనీ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 2ఎంపీ మ్యాక్రో సెన్సర్. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరాను అందించారు.




