- Telugu News Photo Gallery Technology photos Motorola launching new smartphone Motorola edge 50 fusion price and features
Edge 50 Fusion: మిడ్ రేంజ్ బడ్జెట్‌లో పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఫోన్.. సూపర్ ఫీచర్స్
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ మోటోరోలా ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా మిడ్ రేంజ్ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజియన్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: May 17, 2024 | 10:09 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం మోటారోలో భారత మార్కెట్లోకి గురువారం కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజియన్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈనెల 22వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది.

ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన పీఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి స్క్రీన్ అందిస్తున్న కొన్ని ఫోన్‌లలో ఇదీ ఒకటి. ఇక మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజియన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్ టర్బో పవర్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ ఈ ఫోన్ సొంతం.

కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఎల్వైటీ 700 సీ సెన్సర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 1600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందించారు.

ధర విషయానికొస్తే 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.22,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999కి అందుబాటులో ఉంది. ఇక పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2000 డిస్కౌంట్ లభిస్తుంది. హాట్ పింక్, మార్షామాలో బ్లూ కలర్, పీఎంఎంఏ ఫినిష్ తోపాటు ఫారెస్ట్ బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.




