- Telugu News Photo Gallery Technology photos Messaging app whatsapp bringing new features multi device users can connect more then one device at a time
WhatsApp Multi Device: మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్.. ఇకపై ఫోన్ ఇంటర్‌నెట్‌తో సంబంధం లేకుండానే.
WhatsApp Multi Device: కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. మల్టీ డివైజ్ పేరుతో రానున్న ఈ ఫీచర్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
Updated on: Jul 15, 2021 | 10:59 AM

ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది కాబట్టే వాట్సాప్‌కు అంత ఆదరణ ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మెసేజింగ్ యాప్ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.

'మల్టీ డివైజ్' పేరుతో రానున్న ఈ ఫీచర్ సహాయంతో యూజర్ ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నారు.

సాధారణంగా డెస్క్‌టాప్‌లో లాగిన్ అయిన తర్వాత ఫోన్‌లో నెట్ లేకపోయినా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చినా కనెక్షన్ కట్ అవుతుందని మనందరికీ తెలిసిందే. కానీ ఈ కొత్త ఫీచర్‌తో ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

ఈ కొత్త ఫీచర్‌తో ఫోన్‌లో ఇంటర్‌నెట్ ఉందా లేదా అనే సంబంధం లేకుండా యూజర్లు వాట్సాప్ సేవలను వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్‌తో మీ ఫోన్ దగ్గరలో లేకపోయినా ఎప్పుడైనా డెస్క్‌టాప్ యాప్ వినియోగించుకోవచ్చు.

ఈ ఫీచర్‌తో కూడిన వాట్సాప్ బీటా వెర్షన్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ మాతృ కంపెనీ ఫేస్‌బుక్ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే లింక్ చేసిన అన్ని డివైజ్‌లలో మ్యూట్, డిలీట్ వంటి ఆప్షన్స్ ఉండవు. కేవలం మొదట ఓపెన్ చేసిన డివైజ్‌లోనే అవకాశం ఉంటుంది. టెలిగ్రామ్‌లో ఇప్పటికే ఇలాంటి ఫీచర్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.





























