- Telugu News Photo Gallery Technology photos Asus released four models of chromebooks in indian market full features and price details
Asus Chromebooks: భారత మార్కెట్లోకి ఆసుస్ క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్‌లు.. ప్రారంభ ధర రూ. 18,000, ఆకట్టుకునే ఫీచర్లతో..
Asus Chromebooks: కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్, ఆన్‌లైన్ తరగతులు పెరిగాయి. దీనిని క్యాష్ చేసుకోవడానికే ఆసుస్ తాజాగా భారత మార్కెట్లోకి క్రోమ్‌బుక్ సిరీస్‌లో నాలుగు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. వీటి ఫీచర్లు ఎలా ఏంటో ఓసారి చూద్దాం..
TV9 Telugu Digital Desk | Edited By: Narender Vaitla
Updated on: Jul 16, 2021 | 10:09 AM

తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఆసుస్ తాజాగా భారత మార్కెట్లోకి కొత్తగా క్రోమ్‌బుక్ సిరీస్‌లో నాలుగు కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఇవి క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. జులై 22 నుంచి ఫ్లిప్‌కార్టులో అందుబాటులోకి రానుంది.

సీ214 క్రోమ్‌బుక్‌ను 11.6 అంగుళాల ఆంటీగ్లేర్ టచ్ డిస్‌ప్లే, డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో అందించారు. 50Whr బ్యాటరీ దీని మరో ప్రత్యేకత.

సీ423 ఫీచర్ల విషయానికొస్తే.. 14 అంగుళాల టచ్ డిస్‌ప్లే(ఆప్షనల్), ఇంటెల్ హెచ్‌డి గ్రాఫిక్స్ 500, ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ అందించారు.

సీ523 క్రోమ్‌బుక్‌లో 15.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 500, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సీ223 ఫీచర్ల విషయానికొస్తే.. 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, ఇంటెల్ సెలెరాన్ ఎన్3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్, ఇంటెట్ హెచ్‌డీ గ్రాఫిక్స్ 500, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో తీసుకొచ్చారు.

ధరల విషయానికొస్తే.. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214 ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ 423 నాన్ టచ్ మోడల్ ధర రూ.19,999. టచ్ మోడల్ ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ523 నాన్ టచ్ మోడల్ ధర రూ.20,999, టచ్ మోడల్ ధర రూ. 24,999. ఆసుస్ క్రోమ్‌బుక్ సీ223 అతి తక్కువ ధర రూ. 17,999గా నిర్ణయించింది.





























