- Telugu News Photo Gallery Technology photos Laptop And Smartphone Not Getting Connected To WiFi Router, Solve This Problem
Internet: ఇంట్లో WiFi రూటర్‌తో ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదా? ఇలా చేస్తే సమస్య పరిష్కారం
మీరు ఇంట్లో కంప్యూటర్ వర్క్‌గానీ, మొబైల్‌లను వాడుతున్నప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండటం ఉత్తమం. మీకు ఇంట్లోనే ఇంటర్నెట్ సదుపాం ఉంటే రూటర్ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇంటర్నెట్ వేగం పూర్తిగా తగ్గిపోతుంటుంది. సినిమాలు చూస్తున్నా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు మళ్లీ మళ్లీ రూటర్ నుంచి డిస్‌కనెక్ట్ అవుతుంటాయి. ఇంటర్నెట్ సేవ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ అవసరం. వర్క్ చేయడం నుంచి వినోదం వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
Updated on: Mar 04, 2024 | 5:30 AM

మీరు ఇంట్లో కంప్యూటర్ వర్క్‌గానీ, మొబైల్‌లను వాడుతున్నప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండటం ఉత్తమం. మీకు ఇంట్లోనే ఇంటర్నెట్ సదుపాం ఉంటే రూటర్ కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని సందర్భాలలో ఇంటర్నెట్ వేగం పూర్తిగా తగ్గిపోతుంటుంది. సినిమాలు చూస్తున్నా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు మళ్లీ మళ్లీ రూటర్ నుంచి డిస్‌కనెక్ట్ అవుతుంటాయి.

ఇంటర్నెట్ సేవ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ అవసరం. వర్క్ చేయడం నుంచి వినోదం వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. దీంతో చాలా మంది ఇంట్లోనే హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ కోసం రూటర్లను కొనుగోలు చేస్తున్నారు. కానీ మీరు ప్రతిసారీ డిస్‌కనెక్ట్ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించారా? రూటర్ సమస్యలను ఎలా పరిష్కరించాలి? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.

ప్రాథమికంగా ఈ సమస్య రూటర్ యాంటెన్నా వల్ల కావచ్చు. అలాంటప్పుడు, ముందుగా ప్రతిరోజూ రూటర్‌ని 10 నిమిషాలు ఆఫ్‌లో ఉంచండి. సమస్య ఇంకా కొనసాగితే, రూటర్ యాంటెన్నాను మార్చాల్సి ఉంటుంది. అలాగే బ్లూటూత్ పరికరాలను రూటర్‌కు దగ్గరగా ఉంచకపోవడమే మంచిది. అవసరమైతే మీరు రూటర్ స్థానాన్ని కూడా మార్చవచ్చు. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మీరు పనిచేసే గదిలో రూటర్‌ను ఉంచండి. గరిష్ట వేగం కోసం యంత్రాన్ని వీలైనంత ఎక్కువగా గోడకు వేలాడదీయడం మంచిది. కాస్త ఎత్తులో ఉండటం వల్ల కూడా ఇంటర్నెట్ వేగం పెరగవచ్చు.

రూటర్ యాంటెన్నాలను వేర్వేరు దిశల్లో సూచించండి. తద్వారా రేడియో సిగ్నల్ ఇంట్లోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ సమస్య కొనసాగితే మీ రూటర్‌ని రీసెట్ చేయడం మంచిది. ఏదైనా అంతర్గత లేదా సర్క్యూట్ సమస్య దీని ద్వారా పరిష్కరించవచ్చు.




