- Telugu News Photo Gallery Technology photos How to check whether your gmail account login unknown device
Gmail: మీ జీమెయిల్ అకౌంట్‌ను ఎవరైనా యూజ్ చేస్తున్నారని అనుమానంగా ఉందా.?
ప్రస్తుతం జీ మెయిల్ వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్ ఉంటోంది. బ్యాంకు ఖాతాలకు కూడా ఈ మెయిల్ ఐడీలను లింక్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే జీమెయిల్ అకౌంట్‌లు హ్యాక్ గురవుతోన్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. అయితే మన అకౌంట్‌ను ఎవరైన ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉందని మీకు తెలుసా.?
Updated on: Nov 26, 2024 | 9:04 PM

జీమెయిల్ అకౌంట్‌ను ఉపయోగించే సమయంలో మన అకౌంట్‌ను ఎవరైనా ఉపయోగిస్తున్నారన్న అనుమానం రావడం సర్వసాధారణమైన విషయం. కొన్ని సందర్భాల్లో మెయిల్ హ్యాక్ అవుతోన్న సంఘటనలు చూశే ఉంటాం.

అయితే మన అకౌంట్‌ను ఇతరులు ఎవరైనా ఉపయోగిస్తున్నారా.? అన్న అనుమానం వస్తే ఆ విషయాన్ని తెలుసుకునేందుకు ఓ చిన్న ట్రిక్ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందుకోసం ముందుగా జీ మెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత రైట్ సైడ్ టాప్‌లో కనిపించే మీ ప్రొఫెల్ పిక్‌ను క్లిక్ చేయాలి. గూగుల్ అకౌంట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.

ఇందులో కనిపించే ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. కిందికి స్క్రోల్ చేస్తే మీరు లాగిన్ అయిన డివైజ్‌ల వివరాలు కనిపిస్తాయి. అందులో మీ అనుమతి లేకుండా ఎవైనా డివైజ్‌లు ఉంటే వాటిని క్లిక్ చేసి తొలగించుకోవాలి

ఇక మీ జీ మెయిల్ అకౌంట్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతరుల డివైజ్‌లలో లేదా బయటి కంప్యూటర్లలలో లాగిన్ అయితే పని ముగించాక లాగవుట్ చేయడం మర్చిపోకూడదు. అలాగే స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలి.




