- Telugu News Photo Gallery Technology photos How to check whether your facebook data leaked or not here is the option for know
Facebook Data Leake: మీ ఫేస్ బుక్ డేటా లీక్ అయ్యిందో.. లేదో.. ఇలా తెలుసుకోండి..
Facebook Data Leake: ఇటీవల ఫేస్‌బుక్ డేటా లీక్ అంశం ఎంతటి గందరగోళాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. సుమారు 533 మిలియన్ల మంది డేటా లీక్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరి మీ ఫేస్‌బుక్ డేటా లీక్ అయ్యిందో లేదో తెలుసుకోవాలనుందా..? అయితే..
Updated on: Apr 07, 2021 | 2:37 PM

సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా వెంటనే తెలిసిపోతోంది.

మరీ ముఖ్యంగా ప్రస్తుతం సోషల్ మీడియా మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ముఖ్య విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అలవాటుగా మారిపోయింది.

అయితే సోషల్ మీడియాతో లాభాలు ఉన్నట్లే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా డేటా దుర్వినియోగం. తాజాగా ఫేస్‌బుక్‌కు చెందిన సుమారు 533 మిలియన్ల మంది డేటా లీక్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మరి మీ డేటా కూడా లీక్ అయ్యిందోమోననే అనుమానంతో ఉన్నారా.? అయితే ఈ సింపుల్ టెక్నిక్‌తో ఆ విషయాన్ని నిర్ధారణ చేసుకోండి.

ఇందుకోసం https://haveibeenpwned.com అనే వెబ్‌సైట్ ఆ ఆప్షన్‌ను తీసుకొచ్చింది.

ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి ఫేస్‌బుక్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఈ మెయిల్ లేదా ఫోన్ నెంబర్ ఇచ్చి సమాచారం తెలుసుకోవచ్చు.




